పాఠశాలలో చోరీకి యత్నం
వర్ధన్నపేట టౌన్ : మండలంలోని ఇల్లంద గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళ వారం మధ్యాహ్నం గుర్తుతెలి యని వ్యక్తులు చోరీ యత్నానికి పాల్పడ్డారు. ఆ గదిలో మధ్యాహ్న భోజనానికి కావల్సిన బియ్యం, కిరాణ సామగ్రి, టీవీ ఇతర వస్తువులు ఉంచే వారని గ్రామస్తులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం వేళల్లో ఆ గది ఇనుప డోరుకు వెల్డింగ్ చేసిన ఇనుప బెడాన్ని తొలగించారు. అందులో ఏమైనా వస్తులు పోయాయా అన్నది నిర్ధారణ కాలేదు. మంగళవారం బక్రీద్ కావడంతో పాఠశాల సెలవు. బుధవారం ఉపాధ్యాయులు వస్తేనే ఏమై నా చోరీకి గురయ్యాయో ఏమేమి వస్తువులు పోయాయో తెలుస్తోంది. ఈ విషయం వర్ధన్నపేట పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించగా ఎస్సై ఉపేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.