'అక్రమకేసులు ఉపసంహరించుకోవాలి'
జంగారెడ్డిగూడెం: ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులు బనాయించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన ధర్నాతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బాలరాజుపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నేతలు గంటా మురళీ, తానేటి వనిత, సలారి వెంకట్రావు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అక్రమకేసులను బనాయిస్తూ కక్ష పూరిత ధోరణికి పాల్పడుతోందని వారు ఆరోపించారు.