అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ గుడ్‌బై
కరాచి: పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఫర్హాత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. పాకిస్థాన్ టెస్టు జట్టుకు ఓపెనర్‌గా సేవలందించిన ఈ లెఫ్ట్ హ్యండ్ బ్యాట్స్‌మెన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2013లో ఆడాడు. దుబాయ్‌లో జరగనున్న మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్(ఎంసీఎల్)లో పాల్గొననున్న నేపథ్యంలో ఫర్హాత్ రిటైర్మెంట్ నిర్ణయం తసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్థాన్ తరపున 40 టెస్ట్‌లు, 58 వన్డేలు, 7 టీట్వంటీ మ్యాచ్‌లకు ఫర్హాత్ ప్రాతినిథ్యం వహించాడు. మాస్టర్స్ లీగ్‌లో పాల్గొనే క్రీడాకారులు అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకోవాలని పాక్ క్రికెట్ బోర్డు పెట్టిన నిబంధన కారణంగా ఫర్హాత్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు బుధవారం బోర్డు అతనికి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది. లీగ్‌లో తన సహచర ఆటగాళ్లు మహ్మద్ యూసుఫ్, అజార్ మహ్మద్, యాసిర్ హమీద్, నవీద్ రానా, సక్లైన్ ముస్తాక్‌లతో కలిసి ఫర్హాత్ పాల్గొననున్నాడు.