పీఎఫ్ కార్యాలయం ఆఫీసర్ ఇన్చార్జిగా అద్దంకి
కాకినాడ సిటీ :
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, కేంద్ర శ్రామిక మంత్రిత్వశాఖ చేపట్టిన సరళీకృత విధానంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన జిల్లా పీఎఫ్ కార్యాలయం ప్రథమ ఆఫీసర్ ఇ¯ŒSచార్జిగా అద్దంకి అమరేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ సభ్యుల సేవలు విస్తృతం చేసేందుకు, ఉద్యోగుల పీఎఫ్ సభ్యత్వం నమోదు పెంచేందుకు, పీఎఫ్ బకాయిలు వసూలు చేసేందుకు త్వరలో రాజమండ్రి పీఎఫ్ ఆఫీస్ నుంచి అదనపు సిబ్బందిని ఇక్కడ కాకినాడ పీఎఫ్ ఆఫీస్కు బదలాయిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, సంస్థ యజమానుల సేవలకు, పీఎఫ్ సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా కాకినాడ పీఎఫ్ కార్యాలయం విస్తరణ జరుగుతుందన్నారు. పీఎఫ్ పెన్ష¯ŒSదారులు ఆధార్ లింక్లో వారిలో జీవన ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని కోరారు.