Independence Day Message
-
ఈ దేశభక్తి స్టిక్కర్లతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
Independence Day 2021: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపడం కోసం ఇమేజ్‌లు, వాట్సాప్ స్టిక్కర్లు కోసం చూస్తున్నారా? ఈ ప్రాసెస్‌తో మీరు వాట్సాప్ ద్వారా స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన స్టిక్కర్స్ సులభంగా పంపించుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్ నుండి థర్డ్ పార్టీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ లో కేవలం కొన్ని ప్రాథమిక స్టిక్కర్ ప్యాక్‌లు మాత్రమే లభిస్తాయి. ఇండిపెండెన్స్ డే స్టిక్కర్ల కోసం మీరు థర్డ్ పార్టీ యాప్ లపై ఆధారపడాలి. ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంబందించిన కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్లోడ్ చేసుకున్నాక ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. స్టెప్1: గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఇండిపెండెన్స్ డే స్టిక్కర్స్ అని సెర్చ్ చేయాలి. మీకు కావాల్సిన స్కిక్కర్స్ కోసం “Independence Day – August 15 Stickers WA & Frames” అనే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. స్టెప్ 2: మీకు కావాల్సిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకొని ఓపెన్ స్టిక్కర్స్ ప్యాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. స్టెప్ 3: స్టిక్కర్స్ ప్యాక్ మీద ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన స్కిక్కర్స్ డిస్ ప్లే అవుతాయి. స్టెప్ 4: ఆ తర్వాత డిస్ ప్లే అయిన స్కిక్కర్స్ పై ప్లస్ సింబల్ పై ట్యాప్ చేస్తే మీకు కావాల్సిన విజిబిలిటీని సరిచేసుకోవచ్చు. స్టెప్ 5: విజబులిట్ ఆప్షన్ వెరిఫై చేసుకున్న తరువాత వాట్సాప్ లేదా సిగ్నల్ యాప్ ద్వారా మీ స్నేహితులకు సెండ్ చేసే సదుపాయం ఉంటుంది. ఇండిపెండెన్సె డే ఫ్రేమ్స్ మనం పైన చెప్పుకున్న యాప్‌ను డౌన్ లోడ్ చేసిన తర్వాత.. యాప్ లో స్టార్ట్ ఫ్రేమ్ క్రియేషన్ అనే సెక్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇండిపెండెన్స్ డే ఫ్రేమ్స్ డిస్ ప్లే అవుతాయి. ఆ ఫ్రేమ్ ఆప్షన్ క్లిక్ చేసి మీ వ్యక్తిగత ఫోటోలు లేదంటే మీ కుటుంబసభ్యుల ఫోటోల్ని అప్లోడ్ చేసి.. ఆ ఫోటోలపై ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పవచ్చు. ఇండిపెండెన్స్‌డే జిఫ్ ఇమేజెస్ వాట్సాప్ ద్వారా జిఫ్ ఇమేజెస్ ను సులభంగా పంపించుకోవచ్చు. ఎమోజీ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు జిఫ్ ఇమేజ్‌లు డిస్ ప్లే అవుతాయి. మీకు కావాల్సిన జిఫ్ ఇమేజెస్ ను సెలక్ట్ చేసుకొని మీకు కావాల్సిన వారికి సెండ్ చేసుకోవచ్చు. ఆ జిఫ్ ఇమేజెస్ నచ్చకపోతే జిప్ఫర్.కామ్ సైట్ ను విజిట్ చేసి.. ఆ సైట్ ద్వారా మీకు కావాల్సిన ఫోటోల్ని సెలక్ట్ చేసుకోవచ్చు. -
ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యానికిది పరీక్షా సమయమని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రశ్నించడానికి, విభేదించడానికి, జవాబుదారీతనం గురించి అడగడానికి తగిన స్వేచ్ఛ ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఆమె కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య విలువలు క్రమంగా బలపడుతూ వచ్చాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, తరతరాల సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యానికిది పరీక్షా సమయమని అన్నారు. ‘రాయడానికి, మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, విభేదించడానికి, సొంత అభిప్రాయాలు కలిగి ఉండటానికి, జవాబుదారీతనాన్ని కోరడానికి నేడు స్వాతంత్య్రం ఉందా?’అని సోనియా ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడటానికి బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము ప్రతి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ రోజు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో సతమతమవుతోంది. మనమంతా కలిసికట్టుగా దీన్ని జయించి ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలవాలి. గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలను ప్రస్తావిస్తూ... ‘కల్నల్ సంతోష్‌బాబుతో సహా 20 మంది ప్రాణత్యాగం చేసి 60 రోజులు అవుతోంది. వారి ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాను. చైనా దురాక్రమణలను తిప్పికొట్టి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటమే మనం వారికిచ్చే ఘన నివాళి’అని సోనియా పేర్కొన్నారు. -
‘స్వేచ్ఛ.. కొందరికే పరిమితం కాకూడదు’
న్యూఢిల్లీ: స్వేచ్ఛ అనేది ఏ కొందరికో పరిమితం కాకూడదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘ఇటీవల కొన్ని అరాచక శక్తులు మనలోని కొందరి స్వేచ్ఛను హరించాలని ప్రయత్నించడాన్ని చూస్తున్నాం. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. స్వేచ్ఛ ఏ ఒక్కరి సొత్తూ కాదు.. అది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. భారత్‌లోని ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు, గౌరవం పొందే హక్కు ఉన్నాయి’ అని స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.