లఖ్వీ వ్యవహారం: పాక్ రాయబారికి భారత్ సమన్లు
ముంబై పేలుళ్ల సూత్రధారి జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ నిర్బంధాన్ని సస్పెండ్ చేస్తూ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్రంగా స్పందించింది.
భారతదేశంలోని పాక్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాక్ హైకమిషనర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. లఖ్వీ నిర్బంధాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.