20 కోట్ల మంది భారతీయులకు హైబీపీ
లండన్: భారత్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి హైబీపీ ఉందని, 20 కోట్ల మంది దీనితో బాధపడుతున్నారని లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్తవేత్తల సర్వేలో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 113 కోట్లుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా హైబీపీ బాధితుల సంఖ్య 40 ఏళ్లలో రెట్టింపయ్యింది.
2015లో అధిక బీపీ ఉన్న ప్రజల్లో సగం మంది ఆసియావాసులే. చైనాలో సుమారు 2.26 కోట్ల మందికి హైబీపీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల కన్నా పురుషుల్లోనే ఈ సమస్య అధికం. జనాభాలో రక్తపోటు ఉన్న వారి శాతాల పరంగా పరిశీలిస్తే పురుషుల్లో క్రొయేషియా(38%), స్త్రీలలో నైగర్(36%) తొలిస్థానంలో నిలిచాయి.