గ్రామాల్లో తపాలా బ్యాంకు సేవలు
సెప్టెంబర్ 2017 నాటికి అందుబాటులోకి..
ఏర్పాట్లు చేస్తున్న పోస్టల్ శాఖ
బ్యాంకింగ్ సేవలకు ప్రభుత్వ అనుమతి
హన్మకొండ : తపాలా శాఖ తన సేవలను విస్తృత పరుచనుంది. బ్యాంకింగ్ రంగంలోకి అడుగిడనుంది. ఈ మేరకు భారత కంపెనీల చట్టం 2013 ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి బ్యాంకింగ్ ఆవిర్భావ ధృవపత్రాన్ని పొందింది. భారత తపాలా శాఖ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్లోకి వచ్చింది. దీంతో గ్రామీణ ప్రజలకు సులువుగా బ్యాం కింగ్ సేవలు అందనున్నాయి. సెప్టెంబర్ 2017 నుంచి ఈ సేవలు అందించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రజలు బ్యాంకు సేవల కోసం సమీ ప పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. జిల్లాలో 725 గ్రామాల్లో తపాలా శాఖ బ్రాంచీలున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో తపాల బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు జిల్లాలోని 85 సబ్ పోస్టాఫీస్లు, 5 ప్రధాన పోస్టాఫీస్ల్లోనూ బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి.