ఖాట్మండు నుంచి తిరిగి వచ్చిన భారత్ విమానాలు
న్యూఢిల్లీ: నేపాల్లో భారీ భూకంపం సంభవించిన నేపధ్యంలో సహాయక చర్యల నిమిత్తం ఖాట్మండు వెళ్లిన భారత్ విమానాలు వెనక్కు తిరిగి వచ్చాయి. నేపాల్లో మరోసారి భూకంపం రావడంతో విమానాశ్రయంలోని అధికారులు ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సిబ్బందిని ఖాళీ చేయించారు. దాంతో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ విమానాలు ఖాట్మండులో ల్యాండ్ కాకుండానే తిరిగి వచ్చాయి.
నేపాల్లో మరోసారి భూమి కంపించడంతో ఇప్పటికే బిక్కుబిక్కుమంటున్న అక్కడి వారంతా మరోసారి తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అమెరికా భూగర్భ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇది సంభవించినట్లు తెలిపారు.