indian american woman dead
-
విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో విషాదం జరిగింది. కాటేజ్ హోంకు నిప్పంటుకుని భారత సంతతి యువ వ్యాపారవేత్త తాన్య బాతిజ(32) ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 14న జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఆమె పెంపుడు కుక్క కూడా చనిపోయింది. తాన్య న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ డిక్స్ హిల్స్ కాటేజ్ హోంలో నివసిస్తోంది. డెసెంబర్ 14న ఉదయం 3 గంటల సమయంలో ఆమె కాటేజ్‌కు నిప్పంటుకుంది. నిద్ర నుంచి లేచి అగ్నికీలలు చూసి షాక్ అయింది. వెంటనే సాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది. హుటాహుటిన రంగంలోకి దిగిన ఇద్దరు పోలీసులు తాన్యను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ భారీ అగ్నికీలల ధాటికి ఆమెను చేరుకోలేకపోయారు. ఫైరింజన్ పూర్తిగా మంటలు ఆర్పే సమయానికి తాన్య అగ్నికి ఆహుతైంది. ఆమె పెంపుడు కుక్క కూడా మరణించింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. ఈ ఘటనలో నేరపూరితంగా ఏమీ కన్పించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. చదవండి: అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు -
అమెరికా వరదల్లో ఎన్నారై మహిళ మృతి
అమెరికాలోని హ్యూస్టన్ ప్రాంతంలో ఉన్నట్టుండి వచ్చిన వరదల కారణంగా ఎన్నారై మహిళతో సహా ఆరుగురు మరణించారు. అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. పలు ప్రధాన రహదారులు కూడా మునిగిపోయాయి. పాఠశాలలు మూతపడ్డాయి. బెషెల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పనిచేస్తున్న సునీతా సింగ్ (47) ఉద్యోగానికి వెళ్తుండగా కారులోనే మరణించారు. ఉన్నట్టుండి వరదనీరు రావడంతో వాటిలో చిక్కుకుపోయి మరణించినట్లు తెలుస్తోందని ఓ అధికారి తెలిపారు. ఉదయం 6.50 గంటల ప్రాంతంలో ఆమె తనకు ఫోన్ చేసి ఇబ్బందిలో ఉన్నట్లు చెప్పారని ఆమె భర్త రాజీవ్ సింగ్ తెలిపారు. ఆమెకు వెంటనే సాయం అందుతుందని అనుకున్నానని, కానీ అలా జరగకపోవడంతో ఆమె కారులోనే మరణించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో వ్యక్తి 18 చక్రాల క్యాబ్ మునిగిపోవడంతో మరణించిడు. ఇంకో ఇద్దరు రెండు వేర్వేరు వాహనాల్లో మరణించారు. వాలర్ కౌంటీలో 56 ఏళ్ల టీచర్ కూడా తన వాహనం మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. బుష్ ఇంటర్నేషనల్, హాబీ విమానాశ్రయంలో 470 విమానాలను రద్దుచేశారు. రాత్రికి రాత్రి భారీ వర్షం కురవడంతో 8 నుంచి 16 అంగుళాల వరకు నీళ్లు చేరుకున్నాయి.