భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు
ఇస్లామాబాద్: వాస్తవాధీన రేఖ(ఎల్వోసీ) వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని, భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను, మరో పౌరుడు చనిపోయారని, ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా ఇస్లామాబాద్ లోని భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ కు మంగళవారం పాక్ ప్రభుత్వం సమన్లు జారీచేసింది.
వాస్తవాధీన రేఖను ఆనుకుని బజ్వత్, చాప్రా, హర్పాల్, సుచేత్ ఆఘర్, చార్వా సెక్టార్లపై భారత్ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతోందని పాక్ ఆరోపించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధులు తెలిపారు. కాల్పుల వ్యవహారంపై భారత్ కు తీవ్ర నిరసన తెలిపిన పాక్.. ఆ మేరకు వివరణ కోరిందని పేర్కొన్నారు. 2016లో భారత్ 90 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడిందని, పాకిస్థాన్ ఒక్కసారికూడా ఆ పని చేయలేదనిగతవారం దాయాది విదేశాంగ ప్రతినిధి నఫీజ్ జకారియా వ్యాఖ్యానించారు.