Indian director
-
All We Imagine as Light: ఆస్కార్ బరిలో...!
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచే చాన్స్ ఉంది. కనికస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలో, ఛాయాకందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ఇది. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు ఈ చిత్రం గెలుచుకుంది. తాజాగా ఈ సినిమాను 2025 ఆస్కార్ బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపేందుకు ఫ్రాన్స్ దేశం షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుక 2025 మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ కానుందని, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రూ΄÷ందిన ఈ సినిమాను ఇండియాలో హీరో రానా నిర్మాణసంస్థ ‘స్పిరిట్ మీడియా’ డిస్ట్రిబ్యూట్ చేయనుందట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముంబైలో పని చేస్తున్న ఇద్దరు కేరళ నర్సులు ప్రభ (కనికస్రుతి), అను (దివ్య) జీవితాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథనం సాగుతుంది. -
కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ చిత్రాలు
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ చిత్రం చరిత్ర సృష్టించింది. కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రధాన విభాగంగా భావించే పామ్ డ ఓర్’ అవార్డు పోటీలో నిలిచింది ఈ మలయాళ చిత్రం. ముంబైకి చెందిన పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పామ్ డ ఓర్’ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ఏడాది కాన్స్ చిత్రోత్సవం మే 15 నుంచి 25 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన అవార్డులు, స్క్రీనింగ్ కానున్న సినిమాల జాబితాను ప్రకటించారు నిర్వాహకులు. కాన్స్‌లో అత్యధిక బహుమతిని అందించే పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’తో పాటు అమెరికన్ ఫిల్మ్ ‘అనొర’, యూకే ఫిల్మ్ ‘ఓహ్.. కెనడా’, ఫ్రెంచ్ ఫిల్మ్ ‘బీటింగ్ హార్ట్స్’, పోర్చుగల్ ఫిల్మ్ ‘గ్రాండ్ టూర్’ వంటి దాదాపు 20 చిత్రాలు నిలిచాయి. ఇక ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో బ్రిటిష్ ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్’, బల్గేరియన్ దర్శకుడు కోన్స్టాటిన్ బోజనోవ్ దర్శకత్వంలో భారతీయ నటీనటులు భాగమైన ‘ది షేమ్‌లెస్’ చిత్రాలతో పాటు చైనా ఫిల్మ్ ‘బ్లాక్‌డాగ్’, ‘సెప్టెంబర్ సేస్’, జపాన్ ఫిల్మ్ ‘మై సన్‌షైన్’ వంటి 15 చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఇక ‘అవుట్ ఆఫ్ కాంపిటిషన్’ విభాగంలో ‘ఫూరియోషియా: ది మ్యాడ్మాక్స్ సాగ’, ‘రూమర్స్’తో పాటు మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిడ్నైట్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది సఫర్’తో కలిసి నాలుగు చిత్రాలు, కాన్స్ ప్రీమియర్‌లో ‘ఇట్స్ నాట్ మీ’తో పాటు ఆరు చిత్రాలు, స్పెషల్ స్క్రీనింగ్ విభాగంలో ‘ది బ్యూటీ ఆఫ్ ఘాజా’తో కలిపి ఐదు చిత్రాలు ప్రదర్శితం కానున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పామ్ డ ఓర్’ విభాగంలో భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’ పోటీ పడుతోంది. ఈ విభాగంలో 1994లో మలయాళ చిత్రం ‘స్వాహం’ నామినేషన్‌ను దక్కించుకున్నా, అవార్డు గెల్చుకోలేకపోయింది. ఈ సినిమాకు షాజీ నీలకంఠన్ కరుణ్ దర్శకత్వం వహించారు. అలాగే ఇదే విభాగంలో అవార్డు గెలుచుకున్న ఏకైక భారతీయ చిత్రం ‘నీచా నగర్’. 1946లో విడుదలైన ఈ హిందీ సినిమాకు చేతన్ ఆనంద్ దర్శకుడు. ‘నీచా నగర్’ చిత్రం తర్వాత ‘అమర్ భూపాలి’, ‘ఆవారా’ వంటి చిత్రాలు పామ్ డ ఓర్’కు నామినేషన్ దక్కించుకున్నా అవార్డు గెల్చుకోలేకపోయాయి. 30 ఏళ్లకు ఈ విభాగంలో పోటీ పడుతున్న భారతీయ చిత్రం ‘ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్’కు అవార్డు వస్తుందా? అనేది చూడాలి. ఈసారి పామ్ డ ఓర్’ విభాగంలో విజేతను నిర్ణయించే జ్యూరీ అధ్యక్షురాలిగా అమెరికన్ నటి గ్రెటా గెర్విక్ వ్యవహరిస్తున్నారు. ఆల్ వీ ఇమాజిన్... కథేంటంటే... కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ప్రభ, అనులు ముంబైలో పని చేస్తుంటారు. ఈ ఇద్దరూ వారి వారి రిలేషన్షిప్స్లో ఇబ్బందులు పడుతుంటారు. అలా ఈ ఇద్దరూ ఓ రోడ్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశమని సమాచారం. ఈ మలయాళ చిత్రానికి రచయిత–దర్శకురాలు, ఎడిటర్ పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఇక పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. గతంలో పాయల్ దర్శకత్వం వహించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ 2015లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక అయింది. అలాగే పాయల్ దర్శకత్వంలో వచ్చిన మరో డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ 2021లో జరిగిన కాన్స్ ఫెస్టివల్లో ‘గోల్డెన్ ఐ’ అవార్డును గెలుచుకుంది. మరి.. ఈసారి కూడా పాయల్ అవార్డును గెలుస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సంతోష్ కథేంటంటే... బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరికి దర్శకురాలిగా ‘సంతోష్’ తొలి చిత్రం. ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుంది. వితంతువు సంతోష్‌కి తన భర్త చేసే పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం దక్కుతుంది. బలహీన వర్గానికి చెందిన ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం, ఆ పై హత్యకు సంబంధించిన కేసుని ఛేదించే దర్యాప్తు బృందంలో సంతోష్ భాగం అవుతుంది. ఈ కేసుని ఆమె ఎలా హ్యాండిల్ చేసింది? అనేది కథాంశం. మరి.. ఈ చిత్రం కూడా అవార్డు దక్కించుకుంటుందా? చూడాలి. -
ఆమెది ఎవరూ చేయని సాహసం
ముంబైకి చెందిన పాయల్ కపాడియా.. ఈ పేరు అంతర్జాతీయ సినీ ప్రపంచంలో ఇప్పుడు మారుమోగుతోంది. 74వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’కిగానూ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు అందుకుంది ఈమె. తద్వారా ఓ‘యిల్ డె‘ఓర్(గోల్డెన్ ఐ) గెల్చుకున్న మూడో మహిళగా.. భారత్ తరపు నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఫిమేల్ ఫిల్మ్‌మేకర్ చరిత్ర సృష్టించింది. మొత్తం 28 డాక్యుమెంటరీలు ఈ ప్రతిష్టాత్మక కేటగిరీ కోసం పోటీపడగా.. ముంబైకి చెందిన పాయల్ కపాడియాను ప్రైజ్ వరిచింది. వెల్వెట్ అండర్‌గ్రౌండ్, ఆండ్రియా ఆర్నాల్డ్స్ కౌ, త్రో ది లుకింగ్ గ్లాస్ లాంటి టఫ్ డాక్యుమెంటరీలతో కపాడియా తీసిన ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ పోటీపడి నెగ్గింది. ఢిల్లీ డైరెక్టర్ రాహుల్ జైన్ తీసిన ‘ఇన్విజిబుల్ డెమన్స్’ కూడా ఈ కేటగిరీలో పోటీ పడింది. The Oeil d’Or, the award for best documentary presented at the Cannes Film Festival all sections combined, goes to A NIGHT OF KNOWING NOTHING by Payal Kapadia, a film selected at the Directors’ Fortnight. Our warmest congratulations to Payal Kapadia and the entire film crew! 🎉 pic.twitter.com/s0e5ZwyUze — Quinzaine des Réal. (@Quinzaine) July 17, 2021 శెభాష్ పాయల్ విద్యార్థుల నిరసన ప్రదర్శనల నేపథ్యంలో సాగే డాక్యుమెంటరీ ఇది. విడిపోయి దూరంగా ఉన్న తన లవర్‌కి ఓ యూనివర్సిటీ విద్యార్థి రాసే సీక్వెన్స్‌తో ‘ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ కథ సాగుతుంది. కలలు, వాస్తవం, జ్నాపకాలు, స్మృతులు.. ఇలా అన్నీ ఎమోషన్స్ మేళవించి ఉన్నాయి ఇందులో. ఒక సున్నితమైన అంశం చుట్టూ తిరిగే ఈ కథను చాలా సాహసోపేతమైన ప్రయత్నంగా అభివర్ణించారు ఓయిల్ డెఓర్ జ్యూరీ హెడ్ ఎజ్రా ఎడెల్మన్. ఇదివరకు ఒకసారి ఎఫ్టీఐఐ స్టూడెంట్ అయిన కపాడియా.. వాట్ ఈజ్ సమ్మర్ సేయింగ్ డాక్యుమెంటరీ, లాస్ట్ మ్యాంగో బిఫోర్ ది మాన్సూన్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ తీసింది కూడా. 2017లో ఆమె తీసిన ఆఫ్టర్నూన్ క్లౌడ్స్ షార్ట్ ఫిల్మ్ ‘సినీఫాండేషన్’ సెలక్షన్ కింద కేన్స్‌లో ప్రదర్శించారు కూడా. గోల్డెన్ ఐ కేటగిరీని ఆరేళ్ల క్రితం ప్రవేశపెట్టగా.. మూడుసార్లు మహిళలే గెల్చుకున్నారు. మహిళ దర్శకుల్లో అగ్నెస్ వార్దా (ఫేసెస్ ప్లేసెస్ 2017), సిరియన్ జర్నలిస్ట్ ఫిల్మ్ మేకర్ వాద్ అల్ కతీబ్(సోమా-2019)కి ఈ ప్రెస్టేజియస్ అవార్డు గెల్చుకున్నారు. ఇప్పుడు పాయల్ మూడో వ్యక్తి. అయితే భారత్‌కు చెందిన షెర్లీ అబ్రహం-అమిత్ మధేషియా తీసిన ‘ది సినిమా ట్రావెలర్స్’కు 2017లో గోల్డెన్ అవార్డు స్పెషల్ జ్యూరీ మెన్షన్ మాత్రం ఇచ్చారు. -
ఆ అమ్మాయే ఈ అమ్మాయి
స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలో లతిక అనే అమ్మాయి ఉంటుంది. పెద్దయ్యాక ఆ అమ్మాయి హీరోయిన్ ఫ్రిదా పింటో. చిన్నప్పుడు రుబీనా అలి. టీనేజ్‌లో తన్వీ గణేశ్. సినిమాలో తన్వీ స్లమ్ ఏరియాలో ఉంటుంది. స్లమ్ గర్ల్‌లా ఉంటుంది. యాక్షన్ అద్భుతంగా ఉందని, వయసును మించిన అభినయాన్ని ప్రదర్శించిందని ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ ‘స్లమ్ గర్ల్’ తన్వీ రియల్ లైఫ్ ఫొటో ఇది. తన్వీకి ఇప్పుడు 21 ఏళ్లు. యు.ఎస్.లో ఉంటోంది. సినిమాల్లో ట్రై చేస్తోంది. తను ఆర్టిస్ట్ కూడా. మంచి మంచి పెయింటింగ్స్ వేస్తోంది. ఇండియన్ డెరైక్టర్ ఎవరైనా సినిమా తీస్తే మళ్లీ మనం లతికను మనసుదోచే పాత్రలో చూడొచ్చు.