షార్జాలో భారత కార్మికుడి ఆత్మహత్య
దుబాయ్: యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని షార్జాలో పెట్రోకెమికల్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయ కార్మికుడొకరు ఆత్మహత్య చేసుకున్నాడు. పనిస్థలంలోనే ఉరేసుకుని అతడు చనిపోయాడని పోలీసులు తెలిపినట్టు గల్ప్ న్యూస్ తెలిపింది.
మృతుడి పేరు కేఎల్(32)గా మాత్రమే చెబుతున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో అతడు ఉరేసుకున్నాడు. అతడిని రక్షించేందుకు తోటి కార్మికుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. డిప్రెసిన్ కారణంగానే అతడు ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.