indian fisher men
-
కరాచీ జైలు నుండి 20 మంది భారత జాలర్ల విడుదల
-
అవసరమైతే అమిత్ షాతో మాట్లాడుతాం
కోల్‌కతా: బంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా వెళ్లినందుకు గురువారం అరెస్టయిన భారతీయ మత్స్యకారుడిని నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవల ఒక బీఎస్ఎఫ్ జవాన్‌ను ఓ బంగ్లాదేశీ సరిహద్దు భద్రతా బలగాలు తుపాకీతో కాల్చిచంపడం ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అవసరమైతే దీనిపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని వెల్లడించారు. ‘బలగాల మధ్య సమన్వయలోపం కారణంగానే సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ విజయ్ సింగ్ మరణానికి దారి తీశాయి’ అని అసదుజ్జమాన్ చెప్పారు. -
పాక్ చెరలో 18 మంది భారత జాలర్లు
తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్థాన్ తీర రక్షక దళం 18 మంది భారతీయ జాలర్లను అరెస్టుచేసింది. ఆదివారం రాత్రి కరాచీ తీరానికి సమీపంలో పాక్ రక్షక దళాలు భారత జాలర్లను అరెస్టుచేయడంతోపాటు వారి పడవలను స్వాధీనం చేసుకున్నట్లు జీయో న్యూస్ వార్తలను ప్రసారం చేసింది. అయితే అరెస్టయిన వారిని కోర్టులో ప్రవేశపెట్టకుండా రహస్య ప్రదేశానికి తరలించారని తెలిసింది. జాలర్లను అరెస్టు చేసిన వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టడం ఇరుదేశాలూ ఆనవాయితీగా పాటిస్తున్నదే. కాగా జాలర్ల సమాచారాన్ని వెల్లడించేందుకు పాక్ అధికారులెవరూ ముందుకురాలేదు.