భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్
రియో ఒలింపిక్స్ కోసం
న్యూఢిల్లీ: రియో డి జనీరోలో జరిగే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా సచిన్ టెండూల్కర్ వ్యవహరించనున్నారు. రాయబారిగా ఉండాలంటూ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చేసిన విజ్ఞప్తిని ఆయన అంగీకరించారు. ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్‌కు తన సమ్మతిని తెలుపుతూ లేఖ కూడా రాశారు. ఇప్పటికే ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. మరోవైపు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను కూడా సంప్రదించామని, ఇంకా ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు.