indian hospitality award
-
లక్నవరానికి ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు వద్ద ఉన్న కాటేజీలకు ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు లభించినట్లు లక్నవరం యూనిట్ మేనేజర్ రాజ్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు తేజావత్ రామచంద్రుడు, వేణుగోపాలచారిలు లక్నవరం అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న 9 ఐలాండ్లలో 100 కాటేజీల నిర్మాణం కోసం ప్రధానికి ప్రతిపాదన అందజేసినట్లు ఆయన చెప్పారు. దీంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. లక్నవరం సరస్సు అభివృద్ధి కోసం గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌తో పాటు టీఎస్‌టీడీసీ చైర్మన్ బోయినపల్లి మనోహర్‌రావులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరు చేయిస్తున్నారన్నారు. ఇక్కడి రిసార్ట్స్‌కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో కూడా హరిత హోటల్, కాటేజీలలో ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట లక్నవరం బోట్ ఇన్చార్జి శ్రీనివాస్, రణధీర్‌లు ఉన్నారు. -
ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డులు
మాదాపూర్, న్యూస్‌లైన్: ప్రస్తుతం హోటళ్లు మెరుగైన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న పరిశ్రమ ఇదేనని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖన్ అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శనివారం ‘ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డు-13’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫైవ్‌స్టార్, సెవెన్స్టార్లతో పాటు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారికి అవార్డులను ప్రదా నం చేశారు. హోటల్ రంగంలో 19 విభాగాల్లో 65 అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ హోటల్స్ అధ్యక్షులు కృష్ణయ్య, గౌరవ సలహాదారు నాగరాజు, తమిళనాడు హోటల్స్ సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బులు, పిక్కీ వైస్ చైర్మన్ జేఏ చౌదరి పాల్గొన్నారు.