భారత్ స్థావరాలపై పాక్ కాల్పులు
శ్రీనగర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకాశ్మీర్లో సరిహద్దు వెంబడి భారత స్థావరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. పాక్ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కాల్పులు కొనసాగినట్టు రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా చెప్పారు. పూంచ్, రాజౌళి జిల్లాలలోని సరిహద్దు వెంబడి భారత స్థావరాలపై దాడులకు దిగినట్టు తెలిపారు. ఈ దాడుల్లో భారత్కు చెందినవారికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదని చెప్పారు.