ఆగస్టులో విజేందర్ బౌట్
న్యూఢిల్లీ: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ బౌట్‌కు రంగం సిద్ధమైంది. ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ చాంపియన్, చైనా బాక్సర్ జుల్పికర్ మైమైతియలితో ఆగస్టులో ముంబైలో ఈ బౌట్ జరగనుంది. నిజానికి మూడు నెలల క్రితమే ఇద్దరి మధ్య ఈ బౌట్ జరగాల్సివున్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇటీవల ఈ బాక్సర్లను ప్రమోట్ చేస్తున్న సంస్థల మధ్య పోరుకు సంబంధించిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి.