రెండు సహస్రాబ్దాల భారతీయ ప్రచురణలు..!
ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషల్లోని వందలాది పుస్తకాల అనువాదాలతో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కి చెందిన లోబ్ క్లాసికల్ లైబ్రరీ ప్రచురణలు జగత్ప్రసిద్ధి పొందాయి. అదే బాటలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమారుడు రోహన్ రెండు వేల ఏళ్ల కాలం పొడవునా ఆవిర్భవించిన భారతీయ ప్రాచీన రచనల ఆంగ్ల అనువాదాల ప్రచురణకు నడుంకట్టడం ప్రశంసనీయం.
లోబ్ క్లాసికల్ లైబ్రరీ పేరిట హార్వర్డ్ యూనివ ర్సిటీ ప్రెస్ చాలాకాలం క్రితం ప్రచురించిన పుస్త క పరంపర నాకు ఎంతో ప్రీతిపాత్రమైన వాటిలో ఒకటి. ప్రాచీన గ్రీకు, లాటిన్ భాషకు చెందిన వందలాది పుస్తకాల అనువాదాలను వీరు ప్రచురించారు. ఈ పుస్తకాలు అనేక కారణాలతో విశిష్టమైనవి. మొదటిది వాటి పరిమాణం. మనిషి తన జేబులో పెట్టుకుని సులు వుగా మోసుకెళ్లేంత చిన్న పరిమాణంలో ఈ పుస్త కాలు ఇమిడిపోయేవి. ఈ పుస్తకాలు 6 3/8 అంగు ళాల పొడవు, 4 1/4 అంగుళాల వెడల్పుతో అతి చిన్న పరిమాణంలో ఉండేవి. నా వద్ద ఉన్న గ్రంథా లయంలోని దాదాపు 6 వేల పుస్తకాలలో ఇవి అత్యంత చిన్న పుస్తకాలు. వీటిలో ఏ పుస్తకం కూడా మందపాటిగా ఉండేవి కావు. ఎందుకంటే ఒకే పుస్త కాన్ని పలు సంపుటాలలో ప్రచురించేవారు. ఉదాహ రణకు, యురిపిడెస్ రచించిన మూడు నాటకాలు ఒకే సంపుటిగా ఉండవచ్చు కానీ పర్షియన్ యుద్ధ చరిత్ర నాలుగు భాగాలుగా ఉండేది.
ఈ లోబ్ పుస్తకాలను నాగరిక యూరోపియ న్లు 19వ శతాబ్దం ద్వితీయార్థం వరకు చదివేవా రని భావిస్తున్నారు. ప్లేటో, అరిస్టాటిల్, హిప్పోక్రా ట్లు, ప్లూటార్చ్ రచనలు కానీ, హాన్నిబాల్ విజయా లను వర్ణించిన పొలీబియస్ రచనలు, అలెగ్జాండర్ విజయగాథలను నమోదు చేసిన అర్రియాన్ రచ నలు, ఇలియడ్, మహావిషాదాంత నాటకాలు ఈ గ్రంథాలయంలోని గ్రీక్ విభాగంలో ఉండేవి. ఇక లాటిన్ సంపుటాల్లో సిసెరో, సెనెకా, సీజర్ (ప్రాచీ న చరిత్రకు సంబంధించిన అత్యుత్తమ రచయి తలు), లూసియాన్ వంటి తదుపరి వ్యంగ్య రచయి తలు, లివీ, స్యుటోనియస్ వంటి చరిత్రకారులు రచించిన ఉత్తమ గ్రంథాలు కొలువుతీరి ఉండేవి. క్రీస్తు పూర్వం 8వ శతాబ్ది కాలంలో (రోమన్లు 1,300 సంవత్సరాల తర్వాతివారు) నివసించి ఉన్న హోమ ర్ వంటి జగద్విఖ్యాత రచయితల పుస్తకాల జాబితా లోబ్ క్లాసికల్ లైబ్రరీ లాటిన్ విభాగంలో ఉండేది.
ఈ పుస్తకాలు ఇంత అసాధారణంగా ఉండటా నికి రెండో కారణం ఏదంటే, వీటిలోని ప్రతి ఎడమ పేజీలోనూ గ్రీకు, లాటిన్ మూల పాఠం ఉండేది. ఆధునిక ఇంగ్లిష్ అనువాదం కుడి పేజీలో ఉండేది. గ్రీకు, లాటిన్ రెండు భాషలను కొంతవరకు చదవగ లిగిన మాబోటి వారికి ఈ పుస్తకాలు నిజంగా వరం లాటివి. సుప్రసిద్ధ రచయిత్రి వర్జీనియా ఊల్ఫ్ ఈ పుస్తకాల సిరీస్ గురించి 1917లో ఇలా రాశారు.
‘‘ఒక పుటలో గ్రీకు, లాటిన్.. మరొకపుటలో ఇంగ్లిష్ పాఠంతో ఉండే లోబ్ లైబ్రరీ, స్వేచ్ఛకు నిజ మైన బహుమతిగా అడుగుపెట్టింది. ఔత్సాహిక పాఠకులు ఉన్నారనే సంగతిని ఈ లైబ్రరీ గుర్తిం చింది. కొంతమేరకు వీరికి గౌరవం లభించింది కూడా. సామాన్య అభిరుచి ఉన్నవారు కూడా ఈ లైబ్రరీ ప్రచురణలకు ఆకర్షితులయ్యేవారు. చాలావ రకు ఇవి అపార గౌరవాన్ని పొందేవి. గ్రీకు భాష లోని కాఠిన్యతను ఈ అనువాదాలు విస్తరించలేదు. దీంతో సాధారణ ఔత్సాహికులకు అవి చాలా వాస్త వంగానూ, గొప్పగానూ ఉండేవి. పైగా, లోబ్ ప్రచు రణల నుంచి ఎన్నడూ మనం స్వతంత్రంగా ఉండలే మన్న వాస్తవాన్ని గుర్తిస్తూ మన మనస్సులను సమా ధానపర్చుకోవాల్సిందే.’’
లోబ్ సంపుటాలు అన్నీ హార్డ్ బౌండ్తోటే ఉం డేవి. ఒక్కొక్కటి ఒక్కో రంగుతో విడిగా ఉండేవి. గ్రీకు పుస్తకాలు ఆకుపచ్చరంగుతో ఉండేవి. లాటిన్ పుస్తకాలు ఎర్రరంగుతో ఉండేవి. ఇక వీటికి విశిష్టత చేకూర్చిన మూడో అంశం ఏదంటే వీటిని దాతృత్వ సంస్థల నిధులతో ప్రచురించేవారు.
లోబ్ క్లాసికల్ లైబ్రరీ లక్ష్యాన్ని వివరిస్తూ జేమ్స్ లోబ్ ‘వాటి లక్ష్యం, వాటి పరిధి గురించిన మాట’ ను తొలి సంపుటాల్లో పొందుపర్చారు. ‘‘సాహిత్యం లో నిజమైన భాగాలుగా తమకు తాముగా ప్రకా శించే అనువాదాల రూపంలో పురాతన గ్రీకు, రోమ్ సుప్రసిద్ధ రచయితల తాత్వికతను, చెణుకులను, భాషా సౌందర్యాన్ని, గ్రహణను మరింతగా అందు బాటులోకి తీసుకురావడం, గ్రీకు, లాటిన్ రచన లలోని పరిపూర్ణ ఆనందాన్ని అనుభూతి చెందుతూ చదివేలా చేయటం, సాధారణ పాఠకుడికి తలు పులు మూసివేసేటటువంటి, మూల గ్రంథంలోని ప్రతి పంక్తిని యథారూపంలోకి తీసుకువచ్చే పేలవ మైన ఆలోచనల నకలు లేదా రాతప్రతిని తలపించ నివ్వకపోవడం, మూల రచనకు సంబంధించిన ఉత్తమ సంక్లిష్ట పాఠాలను ఈ అనువాదాలతో పక్క పక్కనే ఉంచి పాఠకులకు అందించడం అనే లక్ష్యాన్ని నాకు నేనే విధించుకున్నాను,’’
లోబ్ అంతటి విలువైనదిగా రూపొందిన తొలి భారతీయ సిరీస్ విడుదల సందర్భంగా నేను దీన్ని రాస్తున్నాను. ఇది మూర్తి క్లాసికల్ లైబ్రరీ, దీన్ని కూ డా హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్సే ప్రచురించింది.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారా యణ మూర్తి కుమారుడు రోహన్ (తన చివరి పేరు ను వైవిధ్యంతో ఉచ్చరిస్తారు) అందించిన నిధితో ఏర్పడిన మూర్తి లైబ్రరీ, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలోని పాఠకులకు గడచిన రెండు సహస్రా బ్దాల అత్యుత్తమ భారతీయ సాహిత్య రచనలను అందించడం, ప్రపంచ సాహిత్య సాంస్కృతిక సంపదలో భాగంగా ఈ రచనలను నూతన తరానికి తిరిగి పరిచయం చేయడం అనే లక్ష్యసాధనతో ఏర్పాటైంది.
సీనియర్ మూర్తి సహచర ఇన్ఫోసిస్ బిలియ నీర్లు నందన్ నీలేకని, విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీలు తమ దాతృత్వ చర్యలకు సంబంధించి నంతవరకు భారతీయ బిలియనీర్లలోకెల్లా అత్యంత క్రియాశీలకంగా ఉంటున్నమాట వాస్తవం. అయితే తతిమ్మా భారతీయ సంపన్నులతో పోలిస్తే వీరు మినహాయింపుగా ఉండటమే విషాదకరం. భార తీయ మహా సంపన్నులలో చాలామంది ఆలయా లు, ఖరీదైన ఆసుపత్రుల నిర్మాణానికే తన విరాళా లను వెచ్చిస్తున్నారు. యువ మూర్తి (రోహన్) తన డబ్బును ఇలాంటి మహత్తర కార్యక్రమానికి వెచ్చిం చడం ప్రశంసనీయం.
గత నెల విడుదలైన తొలి అయిదు సంపు టాలు ఇవీ: బులే షా రచించిన ‘సుఫీ గీతాలు’; అబుల్ ఫజల్ రచించిన ‘అక్బర్ చరిత్ర 1వ భాగం’; తొలి బౌద్ధ మహిళల కవితలు ‘తెరిగాథ’; తెలుగు ప్రామాణిక రచన ‘మను కథ’ (మనుచరిత్రము); అంధ రచయిత సూరదాస్ రచనగా చెబుతున్న ‘సుర్ సముద్రం’.
రోహన్ మూర్తి తీసుకువస్తున్న ప్రచురణలు లోబ్ కంటే విస్తృతమైనవి, పెద్దవి. అయితే ఇవి కూడా ఎడమవైపు మూల రచన, కుడివైపున అను వాదం రూపంలోనే ఉంటున్నాయి. ఈ సంవత్సరం మరిన్ని రచనలు ప్రచురణకు నోచుకుంటున్నాయి. తొలి అయిదు రచనలలోని వైవిధ్యతను చూశాక, లోబ్ క్లాసిక్స్లాగా, మూర్తి క్లాసిక్స్ కూడా చరిత్రలో నిలిచిపోగలవని భావిస్తున్నాను.
అవలోకనం: ఆకార్ పటేల్, (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)