Indian teenager
-
కురులతో భారత కుర్రాడు.. గిన్నిస్ బుక్ ఎక్కేశాడు
లండన్: చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటుంటే.. అంతా అతన్ని ఏడిపించేవారట. అమ్మాయిలా.. ఆ జుట్టేంట్రా అని టీజ్ చేసేవారట. అది అతన్ని ఎంతో బాధించేదట. ఇంట్లో గోల చేసి మరీ ఆ జుట్టును తొలగించే ప్రయత్నమూ చేశాడట. కానీ, మత సంప్రదాయాలు(సిక్కు) పాటించే ఆ తల్లిదండ్రులు.. అతనికి సర్దిచెప్పారు. అలా 15 ఏళ్లపాటు అతను ఓర్పుగా పెంచుకున్న జుట్టు అతనిప్పుడు పాపులర్‌ని చేసింది. 15 ఏళ్ల సిదక్‌దీప్ సింగ్ చాహల్.. ప్రపంచంలోనే అతిపొడవైన జుట్టు ఉన్న టీనేజర్‌గా(కుర్రాడు) గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సిదక్‌దీప్.. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అతను జుట్టు తీసింది లేదట. అలా అదిప్పుడు 146 సెంటీమీటర్లు పెరిగి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2024 బుక్‌లో చోటు దక్కేలా చేసింది. Indian teen Sidakdeep Singh Chahal has never cut his hair. It's took him 15 years to grow the longest head of hair on a teenager. — #GWR2024 OUT NOW (@GWR) September 14, 2023 పెరిగేకొద్దీ ఒకానొక టైంలో.. నాకు జుట్టు మీద ఇష్టం పెరిగింది. కానీ, దానిని మెయింటెన్ చేయడం అంత సులువు కాదు. వారానికి రెండు సార్లు తలస్నానం చేస్తాను. కనీసం ఓ గంట పడుతుంది. జుట్టు శుభ్రం చేసుకోవడానికి మా అమ్మ నాకు సాయం చేస్తారు. లేదంటే నాకు ఓ రోజంతా సమయం పడుతుందేమో!.రికార్డు వచ్చిందని చెప్పినప్పుడు మా బంధువులు, నా స్నేహితులు ఎవరూ నమ్మలేదు::: సిదక్‌దీప్ -
సరికొత్త ఉపాయం.. ఉద్యోగాన్ని వదిలేసి...
దుబాయ్: కొడుకుపై నమ్మకంతో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో దిగేందుకు ఓ తండ్రి సిద్ధపడ్డాడు. కుమారుడి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. గోడలకు మేకులు కొట్టకుండానే బరువులను వేలాడదీసేందుకు దుబాయ్‌లో నివసిస్తున్న భారత టీనేజర్ సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు. జెమ్స్ వరల్డ్ అకాడమిలో ప్రస్తుతం 10వ గ్రేడ్ చదువుతున్న ఇషిర్ వాద్వా తన స్కూల్ ప్రాజెక్టు కోసం ఈ విభిన్న ఆలోచన చేశాడు. ఇంజినీరింగ్ చదువుతున్న తన సోదరుడు అవిక్ సాయంతో ఈ సరికొత్త మార్గాన్ని అన్వేషించారు. కుటుంబ సభ్యులతో ఇషిర్ వాద్వా ఈ పద్ధతిలో భాగంగా స్టీల్ టేపులను ముందుగా గోడకు అతికిస్తారు. ఆ తర్వాత నియోడిమియమ్ అయస్కాంతాన్ని ఉపయోగించి ఆ టేపులు బలంగా గోడకు అతుక్కొని ఉండేలా చేస్తారు. దీనికి వారు క్లాపిట్ అని పేరు పెట్టారు. తమ ఇంట్లోని హోం థియేటర్ సిస్టాన్ని ప్రస్తుతం క్లాపిట్కు తగిలించినట్లు ఇషిర్ తండ్రి సుమేశ్ వాద్వా తెలిపారు. ఎక్కువ వేతనం వస్తున్న తన ఉద్యోగాన్ని వదిలి క్లాపిట్ను తన కుటుంబ బిజినెస్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ‘ఖలీజ్ టైమ్స్’కు వెల్లడించారు. చదవండి: ఒక కారును ఇలా కూడా వాడొచ్చా! -
అమెరికాలో 400 మందికి కుచ్చుటోపీ
వాషింగ్టన్: అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న లోపాన్ని గుర్తించిన ఓ భారతీయ యువకుడు భారీ మోసానికి తెరలేపాడు. దాదాపు 400 మంది భారత సంతతి వ్యక్తులకు రూ.5.59 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో నిందితుడిని జనవరి 25 అరెస్ట్ చేసిన పోలీసులు కనక్టికట్లోని ఓ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. 2013లో కిశోర్‌బాబు అమ్మిశెట్టి(30) అనే వ్యక్తి అమెరికాకు స్టూడెంట్ వీసాపై వచ్చాడు. ఇక్కడి బ్యాంకులు పాటించే ప్రొవిజినల్ క్రెడిట్ విధానం కిశోర్‌ను ఆకర్షించింది. దీని కింద నగదు చెల్లింపులు జరిగినా రిజిస్టర్ కాకపోతే బ్యాంకులు ఆ మొత్తాన్ని కస్టమర్ల ఖాతాకు జమచేస్తాయి. ఈ నేపథ్యంలో వస్తువుల అమ్మకం, అద్దె ఇళ్లు ప్రకటనలు ఇచ్చే భారత సంతతి వారిని కిశోర్ టార్గెట్ చేసుకున్నాడు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకుని.. ఆ బ్యాంకుకు ఫోన్ చేసి కస్టమర్‌గా నటించేవాడు. తన ఖాతాకు డబ్బులు పంపినా ఇంకా రిజిస్టర్ కాలేదని బుకాయించేవాడు. దీంతో బ్యాంకులు ప్రొవిజినల్ క్రెడిట్ కింద ఆ మొత్తాన్ని ఖాతాల్లో డిపాజిట్ చేసేవి. అనంతరం ఆ డిపాజిట్ దారులకు ఫోన్ చేసి పొరపాటున వారి అకౌంట్లలో నగదు జమ చేశానని చెప్పేవాడు. బాధితులు నిజమని నమ్మి భారీగా నగదును సమర్పించుకున్నారు. ఈ ఖాతాలను సమీక్షించిన బ్యాంకులు, ఎలాంటి బదిలీలు జరగకపోవడంతో డిపాజిట్లను వెనక్కు తీసుకున్నాయి. దీంతో మోసం వెలుగులోకి వచ్చింది. -
స్కూల్లో అవమానం.. ఎన్నారై విద్యార్థి ఆత్మహత్య
స్కూల్లో అవమానానికి గురికావడంతో.. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల యువకుడు ఇంగ్లండ్‌లోని లీసెస్టర్ నగరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాండన్ సింగ్ రయత్ అనే ఈ విద్యార్థి ఆగస్టులోనే మరణించినా.. అతడి తల్లి మీనా రయత్ ఆ విషయాన్ని ఇప్పుడే బయటపెట్టారు. జాతీయ అవమాన వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పారు. అతడిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించాలని వైద్యులను తాను ప్రాధేయపడ్డానని ఆమె తెలిపారు. తన కుమారుడికి సాయం అందింది గానీ, అది సరిపోలేదని.. అతడి ఆందోళన మరింత దారుణంగా తయారై చివరకు పూర్తి ఫోబియాలోకి వెళ్లిపోయాడని ఆమె తెలిపారు. స్కూల్లో ఏ ఒక్కరు అతడిని ఆదరించినా ఇల్లు వదిలి ఉండేవాడు కాదని మీనా వాపోయారు. యువకుడి ఆత్మహత్యపై పూర్తిస్థాయి దర్యాప్తు జనవరిలో జరగనుంది. ఆగస్టు 9వ తేదీన స్కార్ఫుతో ఉరి వేసుకుని అతడు తన బెడ్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కూడా పలుమార్లు అతడు ఆత్మహత్యాప్రయత్నాలు చేశాడు. మణికట్టు కోసుకోవడం, బ్లీచింగ్ తాగడం లాంటి పద్ధతులతో ప్రయత్నించి, విఫలమయ్యాడు. స్కూల్లో తోటి విద్యార్థులు అతడిని తీవ్రంగా అవమానించేవాళ్లని, విపరీతంగా తిట్టేవారని మీనా అన్నారు. దాంతో గత నవంబర్ నెలలోనే అతడు స్కూలుకు వెళ్లడం మానేశాడు. మీనా బ్యుటీషియన్ కాగా, ఆమె భర్త రాజ్ ఒక దుకాణంలో పనిచేస్తాడు. స్కూల్లో విద్యార్థులతో పాటు డాక్టర్లు కూడా తన కొడుకును సరిగా పట్టించుకోలేదని, వాళ్లంతా కలిసే తమ కొడుకును చంపేసి, తమ జీవితాలను సర్వనాశనం చేశారని ఆమె వాపోయారు. తమ హృదయాలు తీవ్రంగా గాయపడ్డాయని.. అతడికి తగిన మానసిక చికిత్స అందించి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. -
పాక్ సరిహద్దు దాటిన భారతీయ బాలుడు
అనుకోకుండా పాకిస్థాన్ భూబాగంలోని ప్రవేశించిన భారతీయ బాలుడు జితేంద్ర అర్జున్వార్ (15)ను నిన్న చీతా చౌక్ వద్ద పాక్ దళాలు అరెస్ట్ చేసినట్లు కోక్రపార్ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారని స్థానికపత్రిక డాన్ గురువారం తెలిపింది. అనంతరం అతడిని సింధ్ ప్రావెన్స్లోని హైదరాబాద్ నగరంలోని జువైనల్ కరాగారానికి పోలీసులు తరలించినట్లు పేర్కొంది. అతడు హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడని పోలీసులు తెలిపారని ఆ పత్రిక వివరించింది. భారత్‌లోని మధ్యప్రదేశ్‌కు చెందిన ఐశ్వర్య అర్జున్వార్ కుమారుడైన జితేంద్ర అర్జున్వార్ రెండు నెలల క్రితం తన తల్లితో గొడవపడ్డాడు. దాంతో ఆగ్రహాం చెందిన అతడు ఇంట్లో నుంచి పారిపోయాడు. జితేంద్ర దేశంలోని వివిధ ప్రాంతాలలో అతడు సంచరించాడు. ఆ క్రమంలో భారత్ సరిహద్దును చేరుకుని అక్కడ స్వేచ్ఛగా తిరుగసాగాడు. అయితే ఆ సమయంలో అతడికి విపరీతమైన దాహాం వేసింది. తాగటానికి నీరు కోసం అతడు నిర్మానుష్యంగా ఉన్న భారత్ సరిహద్దు అంతా గాలించాడు. ఎక్కడ ఎవరు కనిపించలేదు. కాగా పాక్ భూభాగంలో సైనిక దుస్తులు ధరించిన కొంత మంది వ్యక్తులు అతడికి కనిపించారు. దాంతో వారి వద్దకు వెళ్లి దాహంగా ఉంది మంచి నీరు కావాలని అడిగాడు. దీంతో వారు అతడి గుర్తింపు కార్డును అడిగారు. సైనికులకు జితేంద్ర జరిగిన విషయాన్ని వివరించాడు. దాంతో జితేంద్రను పాక్ సైనికులు ఉన్నతాధికారులకు అప్పగించారు. అతడిని జువైనల్ కరాగారానికి తరలించారు.