Indian woman shooter
-
అపూర్వీకి మరో స్వర్ణం
షూటర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపిక న్యూఢిల్లీ: భారత మహిళా షూటర్ అపూర్వీ చండీలా స్వీడిష్ కప్ గ్రాండ్ ప్రిలో తన అద్భుత ప్రదర్శన మరోసారి కొనసాగించింది. గురువారం జరిగిన 10 మీ. ట్రై సిరీస్ ఈవెంట్ ఫైనల్లోనూ 208.9 పాయింట్లతో స్వర్ణం కొల్లగొట్టింది. మంగళవారం నాటి పోటీలో 10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ రికార్డుతో పాటు స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీ పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి 23 ఏళ్ల చండీలా ‘షూటర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికైంది. అలాగే ఈ రాజస్తానీ షూటర్‌కు వాల్తెర్ రైఫిల్‌ను బహుమానంగా అందించారు. -
అపూర్వీకి కాంస్యం
రియో ఒలింపిక్స్‌కు అర్హత చాంగ్‌వన్ (కొరియా): భారత మహిళా షూటర్ అపూర్వీ చండేలా ఒకే గురికి రెండు లక్ష్యాలను సాధించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈ రాజస్థాన్ షూటర్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. తద్వారా వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందింది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్స్‌లో అపూర్వీ 185.6 పాయింట్ల స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. స్నెజానా పెజ్‌సిచ్ (క్రొయేషియా-209.1 పాయింట్లు) స్వర్ణం, ఇవానా మఖ్సిమోవిచ్ (సెర్బియా-207.7 పాయింట్లు) రజతం సాధించారు. జీతూ రాయ్ తర్వాత రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో భారతీయ షూటర్ అపూర్వీ.