దీపిక-జోష్న జోడికి టైటిల్
కౌలాలంపూర్: మూడు దేశాల స్క్వాష్ డబుల్స్ టోర్నమెంట్లో భారత్ రెండో టైటిల్‌ను సాధించింది. గురువారం ఇక్కడి నేషనల్ స్క్వాష్ సెంటర్లో జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్‌కు చెందిన దీపికా పల్లికాల్, జోష్న చినప్ప జోడి గెలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన జోయెల్ కింగ్, అమందా లాండర్స్‌పై 8-11, 11-5, 11-1 తేడాతో నెగ్గారు. మలేసియా మూడో జట్టుగా పాల్గొన్న ఈ టోర్నీ కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహకంగా జరిగింది. గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్కు ఈ విజయంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతామని పల్లికాల్ తెలిపింది.