ఏటీఎంలో చిరిగిన నోట్లు
కౌతాళం: కౌతాళం బస్టాండ్ ప్రాంతంలోని ఇండీక్యాష్ ఏటీఎం కేంద్రంలో కాలిపోయిన, చిరిగిన నోట్లు వచ్చాయి. శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన కుమార్ రూ. 2 వేలు, విజయ్ రూ. వెయ్యి డ్రా చేయగా అందులో 19 నోట్లు చిరిగి, కాలిపోయినవి, ఎలుకలు కొరినవి వచ్చాయి. ఇది ప్రైవేటు ఏటీఎం కావడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.