అంతర్జాతీయ సదస్సులో అధ్యాపకుల ప్రతిభ
పెదకాకాని: మలేషియా దేశంలో జరిగిన ఐదో అంతర్జాతీయ సదస్సుతో వీవీఐటీ మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన అధ్యాపకులు పాల్గొని తమ పరిశోధన పత్రాలు సమర్పించారని కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. మండల పరిధిలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొడక్షన్ ఎనర్జీ అండ్ రిలయబిలిటీ (ఐసీపీఈఆర్–2016) అంశంపై ఈ సదస్సు నిర్వహించారని చెప్పారు. విద్యాసాగర్ మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి 18 వరకు కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరిగిందని, 25 దేశాలకు చెందిన నిపుణులు హాజరయ్యారని వివరించారు. ఈ బృందంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.కేదార్ మల్లిక్, అసోసియేట్ ప్రొఫెసర్ షేక్ అబ్దుల్ మునాఫ్ ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.