శిలావిగ్రహాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు
తాళ్లపూడి : ప్రక్కిలంకలో బయటపడిన శిలా విగ్రహాన్ని పురావస్తుశాఖకు చెందిన అధికారులు గురువారం పరిశీలించారు. కాకినాడ పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి.వెంకట రత్నం, రాజమహేంద్రవరం మ్యూజియం టెక్నికల్ అసిస్టెంట్ ఎస్.వెంకటరావు విగ్రహాన్ని పరిశీలించి కొలతలు తీసుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ 100 ఏళ్లుగా పూజలు చేస్తున్న మావుళ్ల విగ్రహం 15, 16వ దశాబ్దానికి చెందినదన్నారు. పులి ఉందని దుర్గమ్మగా పూర్వికులు పూజలు చేసి ఉంటారన్నారు. విగ్రహాన్ని ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠ చేయనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. వచ్చే నెలలో జాతర చేయనున్నారు. అధికారుల వెంట బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ముళ్ల మల్లిబాబు, ఉప సర్పంచ్ సుంకర గంగరాజు, యాళ్ల బాబురావు తదితరులు ఉన్నారు.