నేటి నుంచి ఇన్స్ఫైర్ కార్యక్రమాలు
ఎస్కేయూ: ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్ రీసెర్చ్ (ఇన్స్పైర్–2016) కార్యక్రమాలను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పదవ తరగతిలో 92 శాతం పైగా వచ్చిన విద్యార్థులకు ఫిజిక్స్, మేథమెటిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో నాలుగు రోజులు ఎస్కేయూలోని ఫిజిక్స్ విభాగంలో శిక్షణ ఇస్తారు. ఇన్స్పైర్ కార్యక్రమాలు బుధవారం ప్రారంభమవుతున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంగోపాల్ తెలిపారు.