విద్యార్థులకు ‘ఇన్స్పిరేషన్’
తాండూరు: తాండూరులో మూడు రోజులపాటు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన బుధవారంనాటితో ముగిసిం ది. వికారాబాద్ డివిజన్ పరిధిలోని వివి ధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెంది న విద్యార్థినీ, విద్యార్థుల పలు అంశాలపై ప్రయోగ ప్రదర్శనలను అందరినీ ఆకట్టుకున్నాయి. ఎంతో ఆలోజింపచేశాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పాఠశాలల నుంచి 25 పాఠశాలు రానున్న సె ప్టెంబర్ చివరిలో జరుగనున్న రాష్ర్టస్థా యి వైజ్ఞానిక ప్రదర్శకు ఎంపికయ్యాయి. రాష్ట్రస్థాయికి ఎంపిక పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులను జెడ్పీ చైర్పర్సన్ సునీ తారెడ్డి, డీఈఓ రమేష్ సన్మానించారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాలలు..
అగ్గనూర్ జెడ్పీహెచ్ఎస్ (నవీన్), తాండూరు గంగోత్రి (రాజశ్రీ సర్దార్/శ్రేయారెడ్డి), మల్రెడ్డిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (నగేష్), మోత్కుపల్లి జెడ్పీహెచ్ఎస్ (శ్రీకాంత్), వికారాబాద్ జెడ్పీహెచ్ఎస్ (దివ్య), కరన్‌కోట్ జెడ్పీహెచ్ఎస్ (మమత), వెల్చల్ జెడ్పీహెచ్ఎస్ (స్వర్ణలత), ఎన్కతల జెడ్పీహెచ్ఎస్ (కృష్ణవేణి), గోటిగకుర్ధు జెడ్పీహెచ్ఎస్ (శివకుమార్), మద్గుల్ చిట్టంపల్లి (శివలక్ష్మి), సెయింట్ ఆంటోని హైస్కూల్ (భవాని), మోమిన్‌పేట్ జెడ్పీహెచ్ఎస్ (అస్మబే గం), సెయింట్ మేరీ హైస్కూల్ (రోహి త్‌రాజ్), జెడ్పీహెచ్ఎస్ కరన్‌కోట్ (కా వ్య), ప్రతిభా రెసిడెన్షియల్ స్కూల్ (స్వాతికారెడ్డి), జెడ్పీహెచ్ఎస్ గొట్టిముకుల (శివరామరాజు), శ్రీసరస్వతీ శిశుమందిర్ (పవన్‌కళ్యాణ్), యూపీఎస్ పీలా రం (నరేష్కుమార్), ఏపీ మోడల్ స్కూ ల్ (మణిప్రభ), జెడ్పీహెచ్ఎస్ కోత్లాపూర్ (స్వాతి), జెడ్పీహెచ్ఎస్ కోలుకుందా న్యూ (అశ్వంత్), కోటబాస్పల్లి కేరళ మోడల్ హైస్కూల్ (సుజాత), యూపీఎస్ నాగులపల్లి (నర్సింహులు), సెయింట్ మార్క్స్ హైస్కూల్ (శివాని), యూపీఎస్ తిమ్మాయిపల్లి (గీత) పాఠశాలలు, విద్యార్థులు రాష్ర్టస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు.