Insurance premium payment
-
అలర్ట్: సెప్టెంబర్1 నుంచి అమలులోకి వచ్చిన కీలక మార్పులు!
వినియోగదారులకు ముఖ్య గమనిక. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్, టోల్ ట్యాక్స్, ఇన్స్యూరెన్స్, కొత్త ఇళ్ల కొనుగోళ్లు, ఐటీ రిటర్న్ వంటి అంశాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా వ్యవహరిస్తే ఆర్ధికంగా తలెత్తే సమస్యల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇవ్వాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన మార్పులేంటో తెలుసుకుందాం? ప్రీమియం ధర తగ్గింది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) మార్చిన నిబంధనల ప్రకారం.. తగ్గిన ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కాబట్టి, పాలసీదారులు..వారి ఏజెంట్లకు 20శాతం కమిషన్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గడువు తగ్గింది ఆగస్టు 1 తర్వాత ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేసిన వారు వెంటనే ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ వెరిఫికేషన్ గడువును తగ్గించారు. ఇప్పటి వరకు ఈ గడువు 120 రోజులు ఉండగా.. ఇప్పుడు ఆ గడువును 30రోజులకు తగ్గించారు. కేవైసీ పూర్తి చేశారా? కస్టమర్లు ఆగస్ట్ 31 లోగా తమ కేవైసీలను పూర్తి చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోరింది. అయితే గడువులోపు కైవైసీ పూర్తి చేయాలి. లేదంటే బ్యాంక్ ఖాతాదారులు వారి అకౌంట్లలో లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది వాళ్లు అనర్హులు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో చేరే వారిపై ఆంక్షలు విధించింది. అక్టోబర్ 1నుంచి ఆయాదాపు పన్ను చెల్లింపు దారులు ఈ స్కీమ్‌కు అనర్హులని ప్రకటించింది. అంతకంటే ముందు చేరిన వారు అర్హులని తెలిపింది. ఇళ్ల ధరలకు రెక్కలు తెలుగు రాష్ట్రాల్లో కాదు. సెప్టెంబర్ 1 నుంచి ఇళ్ల ధరలు మరింత ఖరీదుగా మారనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్ ల్యాండ్ సర్కిల్ ధరలు 2 నుంచి 3 శాతానికి పెరిగాయి. రానున్న రోజుల్లో యూపీకి చెందిన ఇతర నగరాల్లో సర్కిల్ రేట్లు పెరగనున్నాయి. టోల్ సర్ ఛార్జీల మోత దేశంలోనే అన్నీ జాతీయ రహదారుల్లో టోల్ రేట్లు పెరుగుతున్నాయి. ఆగస్ట్ 31 వరకు యమునా ఎక్స్‌ప్రెస్ హైవేలో ఉన్న టోల్ గేట్ సర్ ఛార్జీలు కిలో మీటర్‌కు 10పైసలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ సెప్టెంబర్ 1 నుంచి ఆ సర్ ఛార్జీలు 50పైసలు పెరిగాయి. -
90 వేల మందికి అన్యాయం
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో జిల్లాలో దాదాపు 90 వేల మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియం చెల్లింపు గడువు ఈ సారి ముందుగానే ముగిసింది. గతంలో చాలాసార్లు ఆగస్టు ఆఖరు వరకు గడువిచ్చారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ బీమా కంపెనీ మొదట జూన్ 30, ఆ తరువాత జులై 9, మరోసారి జులై 31 వరకు గడువు ఇచ్చాయి. మరోసారి గడువు పొడిగిస్తారని రైతులు ఆశించారు. రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచడం లేదు. దీనివల్ల వేరుశనగ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల కింద 6.20 లక్షల మందికి రూ.3,056 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన జులె 31 నాటికి 5.22 లక్షల మంది రూ.2,648 కోట్లు రెన్యూవల్ చేసుకున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. ఇంకా 90 వేల మందికి అన్యాయం జరుగుతోంది. రూ.408 కోట్లు రెన్యూవల్ కావాల్సివుంది. జిల్లా వ్యాప్తంగా 33 ప్రిన్సిపల్ బ్యాంకుల కింద సుమారు 400 శాఖలు పనిచేస్తున్నాయి. రెన్యూవల్‌కు రైతులు ఎగబడుతున్నా బ్యాంకుల్లో సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల వల్ల ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని హెక్టార్లకు ఎన్ని కోట్ల ప్రీమియం చెల్లించారనే లెక్కలు అన్ని బ్యాంకు శాఖల నుంచి అందాల్సివుంది. ఈ సారి అగ్రికల్చర్ గోల్డ్ లోన్ల కింద 68,024 మందికి రూ.438.05 కోట్లు ఇచ్చినట్లు లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) జయశంకర్ తెలిపారు. బీమా గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదన్నారు. -
లాప్స్ అయితే ప్రీమియం పెరగొచ్చు
ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే ముందుగా చేసే పని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం. కాని ఇందులో చాలామంది అనవసర ఖర్చుల్లో బీమా ప్రీమియం చెల్లింపులను కూడా చేరుస్తున్నారు. కాని సకాలంలో ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ ప్రయోజనాలు ఆగిపోయి పాలసీ రద్దు అవుతుందన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ కారణం చేతనైనా పాలసీ లాప్స్ అయితే అత్యవసర పరిస్థితుల్లో సైతం మీ కుటుంబానికి ఎలాంటి బీమా సౌకర్యం, ఆర్థిక రక్షణ లభించదు. ఇది చాలా కుటుంబాలకు పెను విషాదాన్ని మిగులుస్తోంది. ఇలాంటి కేసుల్లో అత్యధికమంది ప్రీమియంలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలపై సరైన అవగాహన లేకపోవడమే కారణం అన్నది తెలుస్తోంది. సాధారణంగా బీమా కంపెనీలు ప్రీమియం చెల్లించాల్సిన సమయం దాటిన తర్వాత కూడా 30 రోజుల గ్రేస్ పిరియడ్‌ను అందిస్తాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రీమియంలు కట్టలేక రద్దు అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తాయి. పాలసీ నియమ నిబంధనలను అనుసరించి నిర్దేశిత కాలంలోగా పాలసీలను పునరుద్ధరించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మరింత ఆలస్యం అయితే ఇలా పునరుద్ధరించుకునే అవకాశాన్ని కూడా కోల్పోతారు. దీనివల్ల అప్పటి వరకు చెల్లించిన ప్రీమియంలపై భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. ముందే చూడాలి అందుకే పాలసీ తీసుకునే ముందే ప్రీమియం గ్రేస్ పిరియడ్, పాలసీ పునరుద్ధరణకు అవకాశాలు వంటి అంశాలను తప్పకుండా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాలసీ పునరుద్ధరణ సమయంలో ప్రీమియంలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా దీర్ఘకాలం చెల్లించకుండా ఆగిపోయిన పాలసీలను పునరుద్ధరించుకునేటప్పుడు ప్రాసెస్ మొదటి నుంచి మొదలవుతుంది. ఆరోగ్య పరీక్షలు, మోర్టాలిటీ చార్జీలు, ఒకవేళ ఆరోగ్య విషయంలో ఏమైనా తేడాలొస్తే ప్రీమియం ధరలు పెరుగుతాయి. అంటే మొదటిసారి పాలసీ తీసుకున్న ప్రీమియం కంటే చాలా ఎక్కువ ప్రీమియం చెల్లిం చాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. సకాలంలో చెల్లించండి ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రీమియంలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుం ది. ఇప్పుడు బీమా కంపెనీలు నేరుగా ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ (ఈసీఎస్) ద్వారా ప్రీమియంలు చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ విధానాన్ని ఎంచుకుంటే ప్రీమియం చెల్లించే సమయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి తగ్గట్టుగా ముందుగానే ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కాబట్టి, ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ప్రీమియం అనేది భారంగా పరిగణించే పరిస్థితి ఉండదు. పొదుపు తర్వాతనే ఖర్చు అనే సూత్రాన్ని అవలంబిస్తూ ప్రీమియానికి కావల్సిన మొత్తాన్ని ముందుగానే సమకూర్చుకోండి.