రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు!
తెలంగాణ
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈ నెల 27 లేదా 28వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. 26వ తేదీనే ఫలితాలు వెల్లడించాలని తొలుత భావించినప్పటికీ... సంబంధిత పనులు పూర్తికాకపోవడంతో ఒకటి రెండు రోజుల పాటు వాయిదా వేశారు.
అయితే సోమవారం జేఈఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇంటర్ ఫలితాలను కూడా ప్రకటిస్తారా, లేక మంగళవారానికి వాయిదా వేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.