ఎస్సీ రైల్వేకు గోల్ఫ్ టైటిల్
ఇంటర్ క్లబ్ గోల్ఫ్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఇంటర్ క్లబ్ గోల్ఫ్ టోర్నీలో సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. బొల్లారంలోని బెప్టా క్లబ్లో మంగళవారం జరిగిన పోటీల్లో ఎస్సీఆర్ జట్టు గెలిచింది.
ఆతిథ్య బెప్టా క్లబ్ జట్టుకు రెండో స్థానం దక్కింది. ఎస్సీఆర్ జట్టు తరఫున రాజ్ కుమార్, ఎ.రవి, నరేన్ సింగ్, నరేందర్, వాసుదేవన్, సురేష్ గిరిరాజ్లు చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. ఈ టోర్నీలో నరేన్ కుమార్ సింగ్ బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు.