inter college chess tourny
-
విజేత అరోరా డిగ్రీ కాలేజ్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్లో ఆతిథ్య అరోరా డిగ్రీ, పీజీ కాలేజ్ సత్తా చాటింది. మొత్తం 36 కాలేజ్‌లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో 11 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 10 పాయింట్లు సాధించిన సీబీఐటీ కాలేజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా... ఎంజేసీఈటీ (9), ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ (9)లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్ని సంపాదించుకున్నాయి. సీబీఐటీకి చెందిన యశోవర్ధన్ 5 పాయింట్లతో ‘బోర్డు విన్నర్’గా నిలవగా... ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్రీడాకారుడు దీప్తాంశ్ రెడ్డి ‘బోర్డు రన్నర్’గా నిలిచాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ బులుసు విశ్వానందం, సెక్రటరీ సునీల్ కుమార్, సీబీఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ మోహన్ రెడ్డి, ఎస్పీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్. హరినారాయణ రావు పాల్గొన్నారు. -
అరోరా కాలేజ్ గెలుపు
ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్లో ఆరోరా డిగ్రీ కాలేజ్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్, సీబీఐటీ, సెరుుంట్ మేరీస్ కాలేజ్‌లు విజయం సాధించారుు. ఆరోరా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన పురుషుల పోటీల్లో ఓయూ కాలేజ్ (4)... భద్రుక కాలేజ్‌పై, అరోరా డిగ్రీ కాలేజ్ (4)... ఓయూ కామర్స్ (2) కాలేజ్‌పై, సీబీఐటీ (4)... నిజాం కాలేజ్ (2)పై గెలుపొందారుు. ఎంజేసీఈటీ (3), ఎంవీఎస్ఆర్ (3) కాలేజ్‌ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. మొత్తం 36 కాలేజ్‌లు తలపడుతున్న ఈ టోర్నీని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ పి. వెంకట్ రెడ్డి, ఆరోరా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌స సెక్రటరీ రమేశ్, ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు.