'అది ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం'
విశాఖ: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్ట్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత రామకోటయ్య వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. విశాఖ కు మెట్రో వస్తేనే..ఎయిర్ పోర్టు వల్ల లాభం ఉంటుందని ఆయన తెలిపారు.
కాగా 5 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కానీ పరిసర ప్రాంతాల రైతులు విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. 9 పంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తాయి.