85 ఫోర్లు, 5 సిక్సర్లు.. 546 పరుగులు
ముంబై టీనేజ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా జాతీయ రికార్డు సృష్టించాడు. అంతర్ పాఠశాలల టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా 15 ఏళ్ల పృథ్వీ (85 ఫోర్లు, 5 సిక్సర్లతో 546) రికార్డ్ బ్రేక్ చేశాడు.
ప్రతిష్టాత్మక హారీస్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆజాద్ మైదాన్‌లో బుధవారం సెయింట్ ఫ్రాన్సిస్ డీ అస్సిసి బోరివలి జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ రికార్డు ఇప్పటిదాకా టీమిండియా మాజీ ఓపెనర్ వసం జాఫర్ మేనల్లుడు ఆర్మన్ (498) పేరిట ఉంది. తాజాగా పృథ్వీ బద్దలు కొట్టాడు. మహారాష్ట్ర అండర్-16 జట్టుకు పృథ్వీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా వీరిద్దరూ రిజ్వి స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాల విద్యార్థులు కావడం విశేషం. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ కూడా హారీస్ షీల్డ్ టోర్నీ ద్వారానే తొలుతు వెలుగులోకి వచ్చాడు. వినోద్ కాంబ్లీతో కలసి మాస్టర్ రికార్డు భాగస్వామ్యం (664) నెలకొల్పాడు.