International challenge
-
అశ్విని జోడీకి టైటిల్
నాంటెస్ (ఫ్రాన్స్): భారత సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్ప నాంటెస్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీ మహిళల డబుల్స్‌లో విజేతగా నిలిచింది. అశి్వని–తనీషా క్రాస్టో జంట ఫైనల్లో 21–15, 21–14తో హంగ్ ఎన్ జు–లిన్ యు పే (చైనీస్ తైపీ) జోడీపై అలవోక విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో భారత ద్వయం 0–4తో వెనుకబడింది. తర్వాత అశి్వని–తనీషా ద్వయం వరుసగా పాయింట్లు సాధించి 10–10 వద్ద తొలి గేమ్‌ను సమం చేసి ఆ తర్వాత అదే జోరుతో గేమ్‌ను గెలుచుకుంది. అనంతరం రెండో గేమ్‌లో 3–3 వద్ద ఉండగా... భారత జోడీ వరుసగా 7 పాయింట్లు గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. చివరకు 31 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా–సాయి ప్రతీక్ జంటకు అదృష్టం కలిసిరాలేదు. క్వాలిఫయర్స్‌గా బరిలోకి దిగి ఫైనల్ చేరిన ఈ జంట పరాజయాన్ని ఎదుర్కొంది. ఫైనల్లో తనీషా–సాయిప్రతీక్ జోడీ 21–14, 14–21, 17–21తో మాడ్స్ వెస్టెర్గార్డ్–క్రిస్టిన్ బస్చ్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడిపోయింది. -
రుత్వికకు టైటిల్
టాటా ఓపెన్ బ్యాడ్మింటన్ ముంబై: టాటా ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్వికా శివాని మహిళల టైటిల్‌ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో రుత్విక 19-21, 21-18, 21-14తో అరుంధతి పంతవానేపై గెలిచింది. పురుషుల సింగిల్స్ టైటిల్ పోరులో గురుసాయిదత్ 16-21, 22-20, 17-21తో హెచ్.ఎస్.ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో అపర్ణా బాలన్-ప్రజక్తా సావంత్ 21-13, 10-21, 21-13తో మేఘన-మనీషాపై; మిక్స్‌డ్‌లో సిక్కి రెడ్డి-మనూ అత్రి జంట 21-19, 19-21, 21-10తో అక్షయ్ దివాల్కర్-ప్రద్న్యా గాద్రెపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-మనూ అత్రి 21-15, 21-15తో శ్లోక్ రామచంద్రన్-సంయమ్ శుక్లాపై నెగ్గారు.