'అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్‌గా ఏపీ'
మంగళగిరి (గుంటూరు) : అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముందని కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో శనివారం పదో వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
'తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందిచేందుకు నేటి యువత పరిశోధనారంగంపై దృష్టి సారించాలి. నేటి యువత అబ్రాడ్ వెళ్లి సంపాదించి తిరిగి మాతృస్థలానికి వచ్చి సేవలు చేయాలి. కన్నతల్లి, జన్మభూమిని మరవరాదు. భారతదేశం విజ్ఞాన గని. నేటి యువతకు ఎన్నో ఆధునిక అవకాశాలు అందుబాటులో ఉన్నందున వాటిని అందిపుచ్చుకుని దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి' అని వెంకయ్యనాయుడు అన్నారు.
రాష్ట్రం విడిపోవడంతో వైద్యరంగంలో మనం తీవ్రంగా నష్టపోయామని, దానిని పూడ్చుకునేందుకు ఆరోగ్య రాజధానిని నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.