మళ్లీ పేలిన పెట్రో బాంబు.. లీటర్ కు 1.63 పెంపు!
మధ్య తరగతి వినియోగదారుడిపై పెట్రో బాంబు మళ్లీ పేలింది. లీటర్ పెట్రోల్ ధరను రు.1.63 పెంచుతూ దేశీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి హెచ్చు తగ్గులు, ఇంటర్నేషనల్ మోటార్ స్పిరిట్ ధరలు వ్యత్యాసం కారణంగానే పెట్రో ధరను పెంచడం జరిగిందని ఐఓసీ తెలిపింది.
నాలుగు ప్రధాన నగరాల్లో సవరించిన పెట్రోల్ ధరలు ఐఓసీ వెల్లడించింది. గతంలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 74.10 రూపాయలు ఉండగా 76.06 చేరుకుంది. కోల్ కతాలో 81.57 నుంచి 83.62కు, ముంబైలో 81.57 నుంచి 83.63 కు, చెన్నై లో 77.48 నుంచి 79.55 పెరిగింది.