జెన్కో ఇంటర్ ప్రాజెక్టు క్రీడలు ప్రారంభం
పాల్వంచ (ఖమ్మం) : మూడు రోజుల పాటు జరగనున్న జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ బాల్ బ్యాడ్మింటన్, చెస్ క్రీడా పోటీలు సోమవారం ఖమ్మం జిల్లా పాల్వంచలో ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను కేటీపీఎస్ ఓఅండ్ఎం సీఈ వి.మంగేష్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాపతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పోటీల్లో ఆర్టీపీఎస్(రామగుండం), శ్రీశైలం, కేటీపీపీ(భూపాలపల్లి), జూరాల, కేటీపీఎస్ ఓ అండ్ఎం, కేటీపీఎస్ 5,6 దశల టీంలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో 5, 6 దశల సీఈ పి.రత్నాకర్, జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్ఈ వి.కిషన్, స్పోర్ట్స్ సెక్రటరీ టి.వీరస్వామి, వైటీఎంకే.రాజు, కట్టా శ్రీధర్, బి.రామారావు, పీలే శ్రీనివాస్, రిఫరీలు బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.