అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ టింకూ అరెస్ట్
కడప: మరో ఎర్ర చందనం స్మగ్లర్‌ను పోలీసలు అరెస్టు చేశారు. అంతార్జాతీయ స్థాయిలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న టింకూ శర్మను కడప పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఈ విషయాన్ని వైఎస్సార్ జిల్లా పోలీసులు జిల్లా కేంద్రంలో వెల్లడించారు.
గత రెండు రోజుల క్రితం అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జైపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఢిల్లీ, చైనాలోని అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.