రెండో తరం మోటో ఎక్స్ వచ్చేసింది...
అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తాజా ఉత్పత్తి ‘మోటో ఎక్స్’ భారత్‌లో విడుదలైంది. విదేశీ మార్కెట్లతో పోలిస్తే రెండు వేల రూపాయలు తక్కువకే అంటే రూ.29,999లకు దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇక దీని ఫీచర్ల సంగతికొస్తే.. మోటోఎక్స్ ముఖ్యమైన ఫీచర్ దాని ప్రాసెసర్ వేగమే.. దాదాపు 2.5 గిగాహెర్ట్జ్ క్లాక్‌స్పీడ్‌తో పనిచేసే, నాలుగు కోర్లున్న క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
స్క్రీన్ సైజు 5.2 అంగుళాలు. కేవలం 9.9 మిల్లీమీటర్ల మందముండే మోటో ఎక్స్‌లో రెండు జీబీల ర్యామ్, 16 జీబీల మెమరీని ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 144 గ్రాములు మాత్రమే. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 13 ఎంపీ, సెల్ఫీ కెమెరా 2 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. త్రీజీ, బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టివిటీ ఆప్షన్లున్న ఈ ఫోన్ 2300 ఎంఏహెచ్ బ్యాటరీతో నడుస్తుంది.