మన ‘నెట్టింట్లోకి హార్ట్‌బ్లీడ్ వైరస్!
న్యూఢిల్లీ: నెటిజన్ల పాస్వర్డ్లు, క్రెడిట్‌కార్డుల వివరాలను హాకర్లు తస్కరించడంలో దోహదపడిన ‘హార్ట్‌బ్లీడ్’ అనే ప్రమాదకర ఇంటర్నెట్ వైరస్ దేశ కంప్యూటర్లలోకి చొరబడినట్లు సైబర్ భద్రతాధికారులు పేర్కొన్నారు.
ఈ వైరస్పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీని బారి నుంచి తప్పించుకునేందుకు పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలని, ఓపెన్ ఎస్ఎస్ఎల్ను 1.0.1జీ వర్షెన్కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని, యాంటీ వైరస్లు, ఇతర ఫైర్‌వాల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.