నెల్లూరు జిల్లా ప్లీనరీ పరిశీలకుల నియామకం
కాకినాడ:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ ప్లీనరీకి జిల్లాకు చెందిన ఇద్దరిని పరిశీలకులుగా నియమించారు. ఈ నెల 30న నెల్లూరులో ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ ప్లీనరీకి తూర్పుగోదావరికి చెందిన పార్టీ సీఈసీ సభ్యులు, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ జడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణులను రాష్ట్ర పార్టీ నియమించింది. తూర్పుగోదావరి జిల్లాకు ఆహ్వానితులుగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను నియమించారు.