రూ.12.5 కోట్లు పలికిన దినేష్ కార్తీక్
బెంగళూరు: ఐపీఎల్-7 వేలం ఆసక్తికరంగా సాగుతోంది. దేశీయ, జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లలో హేమాహేమీలను కొనేందుకు ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడలేదు. గత ఐపీఎల్లో రాణించిన తమిళనాడు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్కు ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.12.5 కోట్లకు దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. రాబిన్ ఊతప్పను రూ. 5 కోట్లను కోల్కతా నైట్ రైడర్స్, అమిత్ మిశ్రాను రూ. 2.25 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నాయి.
శ్రీలంక సీనియర్ ఆటగాళ్లు మహేల జయవర్థనే(రూ. 2 కోట్లు), దిల్షాన్(రూ. 2కోట్లు), మాథ్యూస్(రూ.2కోట్లు), రాస్ టేలర్(రూ. 2 కోట్లు), నాథన్ మెకల్లమ్(రూ. కోటి), డేవిడ్ హసీ(రూ. కోటి)లను ఎవరూ కొనలేదు. భారత ఆటగాళ్లు ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, మురళీ కార్తీక్, బద్రీనాథ్, నమన్ ఓజా కూడా అమ్ముడుపోని జాబితాలో ఉన్నారు.