ఇరాన్ ఎన్నికల్లో మహిళల హవా
టెహ్రాన్: సంప్రదాయ ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమైన ఇరాన్ పార్లమెంట్లో ఈ సారి మత పెద్దల సంఖ్య కన్నా మహిళల సంఖ్య ఎక్కువ కానుంది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు తాజా ఎన్నికలు తార్కాణంగా నిలిచాయి. ఈ రెండో దశ పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు హసన్ రోహనీ మద్దతుదారలైన సంస్కరణ, మితవాద నేతలు మెజారిటీ సంఖ్యలో గెలుపొందారు. వారిలో 17 మంది మహిళలున్నారు.
చాంధస, సంప్రదాయ నేతలు పెద్ద సంఖ్యలో ఓడిపోయారు.1979 లో జరిగిన తొలి ఎన్నికల్లో 164 మంది మతపెద్దలు ఎన్నికవగా, ఈ ఎన్నికల్లో వారి సంఖ్య 16కి పడిపోయింది. ఇరాన్ రాజకీయాల్లో మతపెద్దల ప్రాధాన్యం గణనీయమైంది. ఇరాన్‌లోని మొత్తం మహిళల జనాభాలో ఈ 17 మంది ప్రాతినిధ్యం తక్కువే అయినా గత పార్లమెంట్‌లోని 9మంది మహిళా ఎంపీలతో పోలిస్తే కాస్త నయమే.