iraq clashes
-
మా ఆస్పత్రుల్లో ఉద్యోగాలిస్తా.. రండి!!
ఇరాక్ అల్లర్ల పుణ్యమాని ఉద్యోగాలు పోగొట్టుకుని, ఉగ్రవాదుల చెరలో చిక్కి, ఎట్టకేలకు మాతృభూమికి తిరిగివెళ్లిన 46 మంది నర్సులకు తన ఆస్పత్రులలో ఉద్యోగాలు ఇస్తానని దుబాయ్‌కి చెందిన భారతీయ వ్యాపారవేత్త ఒకరు పిలిచారు. గల్ఫ్ దేశాలతో పాటు భారత్, నేపాల్, భూటాన్ దేశాల్లో ఆస్పత్రులున్న బీఆర్ శెట్లి వాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కేరళలోని వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులు ఈ ఆఫర్ పట్ల ఆసక్తి ఉంటే తన కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. తిక్రిత్‌లో ఉన్న ఈ నర్సులను సున్నీ తీవ్రవాదులు మోసుల్కు తీసుకొచ్చి.. చివరకు శుక్రవారం నాడు కుర్దిష్ రాజధాని ఎర్బిల్‌లో విడిచిపెట్టారు. ప్రత్యేక విమానంలో వాళ్లంతా భారతదేశానికి చేరుకున్నారు. యూఏఈ సహా పలు దేశాల్లో శెట్టికి చెందిన ఎన్ఎంసీ గ్రూపునకు ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. -
భారత్ చేరుకున్న కేరళ నర్సులు, తెలుగువారు
ఇరాక్‌లో సున్నీ ఉగ్రవాదుల చెరలో చిక్కుకుని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపి.. ఎట్టకేలకు వారి చెరవీడిన కేరళ నర్సులు ముంబై చేరుకున్నారు. ఉదయం 8.43 గంటలకు వీరు బయల్దేరిన ప్రత్యేక విమానం ముంబైలో దిగింది. ఇందులో 46 మంది నర్సులతో పాటు మరో 137 మంది ఇతరులు కూడా ఉన్నారు. ఉదయం 11.55 గంటలకు ఇది కొచ్చి చేరుకుంటుంది. అక్కడినుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాద్ వెళ్తుంది. చిట్టచివరకు సాయంత్రం 5.40 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. కాగా, కొచ్చి విమానాశ్రయంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ స్వయంగా వెళ్లి వారిని మాతృభూమికి ఆహ్వానిస్తారు. నర్సుల కోసం ప్రత్యేకంగా ఒక ఇమ్మిగ్రేషన్ డెస్కును ఏర్పాటు చేశారు. భారతీయ దౌత్యాధికారుల చొరవతో విడుదలైన నర్సులంతా కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ నుంచి బయల్దేరిన విమానంలో భారత్ చేరుకున్నారు. ఇరాక్‌లో చిక్కుకున్న మరికొందరు భారతీయులు కూడా ఇదే విమానంలో ఉన్నారు. మొత్తం 183 మంది ప్రయాణికులుండగా వారిలో 23 మంది విమాన సిబ్బంది, ముగ్గురు ప్రభుత్వాధికారులు ఉన్నారు. 46 మంది కేరళ నర్సులు కాక మిగిలినవారిలో వంద మంది తెలుగువారని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి.