బాంబు పేలుళ్లు : 19 మంది మృతి
బగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్ బాగ్దాద్ మార్కెట్ ప్రాంతంలో శనివారం రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 19 మంది వరకు మరణించగా, 43 మంది ప్రజలు గాయపడ్డట్టు ఇరాక్ పోలీసులు తెలిపారు. ఉదయం పూట రద్దీగా ఉండే ఆల్-సైనిక్ ప్రాంతంలోని దుకాణాల వద్ద ఈ బాంబు పేలుళ్లు సంభవించాయని పోలీసులు పేర్కొన్నారు.
వీటిలో ఒకటి ఆత్మాహుతి దాడిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇరాక్ అంతర్యుద్ధం తారస్థాయికి చేరుకోవడంతో అక్టోబర్ 17 నుంచి బాగ్దాద్‌లో హైఅలర్ట్‌లో ఉంది. గత కొన్ని నెలలుగా జిహాదిస్ట్ గ్రూప్ బాగ్దాద్‌లో పలు ఘటనలకు పాల్పడుతూ ఇరాక్‌ను దద్దరిలిస్తోంది. అయితే శనివారం దాడి ఎవరి చేశారన్నది ఇంకా తెలియరాలేదు. దాడులకు బాధ్యులుగా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.