'ఐరన్ మ్యాన్' వల్లే ఈ ఆలోచన: జూకర్ బర్గ్
శాన్ ఫ్రాన్సిస్కో: ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం తన ఇంటి కోసం అవసమైన ఓ సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. ఇందుకోసం హాలీవుడ్ మూవీ 'ఐరన్ మ్యాన్' చూసి తాను ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌కు జర్వీస్ అని పేరు పెట్టారు. ఆ సాఫ్ట్వేర్ తన ఫ్యామిలీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారు దానితో ఆటలు మొదలుపెట్టారని వివరించారు. తన కూతురు మ్యాక్స్ కు దీని అవసరం ఎంతైనా ఉందని జూకర్ బర్గ్ అభిప్రాయపడ్డారు.
ఐరన్ మ్యాన్ మూవీ వల్ల తనకు వచ్చిన ఆలోచనను 100 రోజుల్లో అమలు చేయాలని భావించాను, అయితే తక్కువ రోజుల్లోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తంచేశారు. స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ పనిచేస్తుందన్నారు. ఇంట్లోని వ్యక్తుల ముఖాలను గుర్తిస్తుందని, వారు చెప్పిన విషయాలను తన లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అర్థం చేసుకుని రిప్లై ఇస్తుందని తెలిపారు.
మ్యూజిక్ అన్ చేయాలని చెప్పగానే తాను రెగ్యూలర్ గా వినే ప్లే లిస్ట్ నుంచి సాంగ్స్ రన్ చేస్తుందని.. తన కూతురు మ్యాక్స్ కు వినోదాన్ని పంచుతుందన్నారు. ఏదైనా కొత్త విషయాన్ని చెబితే జార్విస్ ఈజీగా నేర్చుకుంటుందని తన లేటెస్ట్ ఫేస్బుక్ పోస్ట్ లో రాసుకొచ్చారు.