పాత ఇనుముతో సూపర్ బైక్!
వైవీయూ: పాత ఇనుము సామానుతో రూపొందించిన ‘సూపర్ బైక్’అందరినీ ఆకర్షిస్తోంది. వైఎస్సార్ జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ)లో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్న ఎన్.లక్ష్మీనరసింహరాజు ఈ బైక్‌ను తయారు చేశారు. గతంలో వినూత్నమైన సైకిల్‌ను రూపొందించి మన్ననలు పొందిన ఈయన తాజాగా రూపొందించిన ఈ బైక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
పాత ఇనుమును వినియోగించి రూపొందించిన బైక్ 6 అడుగుల పొడవుతో రేసింగ్ బైక్‌లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. రూ.38 వేలు ఖర్చుతో 3 నెలలు శ్రమించి 55 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బైక్‌ను తీర్చిదిద్దారు. 6 అడుగులు ఉన్న ఈ బైక్‌ను అవసరమైతే 9 అడుగుల వరకు పొడిగించుకునేలా రూపొందించారు. లైటింగ్ సిస్టం ఆకట్టుకునేలా.. బైక్ వెళ్తున్న సమయంలో బంతి తిరుగుతూ ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు.