Isha Negi
-
ప్రముఖ మోడల్‌తో పంత్ డేటింగ్.. పాత గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్..?
న్యూఢిల్లీ: కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా యువ డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. అదే ఫామ్‌ను రియల్ లైఫ్‌లోనూ కొనసాగిస్తున్నాడు. పాత గర్ల్‌ఫ్రెండ్, బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలాతో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పి, ప్రముఖ మోడల్ఇషా నేగితో డేటింగ్ చేస్తున్నాడు. ఇటీవల రౌటేలా వ్యాట్సాప్‌ను బ్లాక్ చేసిన పంత్.. తాజాగా ఇషా నేగితో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ బహిర్గతమైంది. ఈ పోస్ట్‌లో పంత్.. ఇషాను ఎంత ఇష్టపడుతున్నాడో స్పష్టంగా తెలియజేశాడు. నిన్ను నేనెప్పుడూ హ్యాపీగా ఉంచాలనుకుంటున్నాను.. ఎందుకంటే నేను హ్యాపీగా ఉండటానికి నువ్వే కారణమంటూ తన పోస్టులో రాశాడు. View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) View this post on Instagram A post shared by Isha Negi (@ishanegi_) మరోవైపు ఇషాకు కూడా పంత్‌పై అమితమైన ప్రేమ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పంత్‌తో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. నువ్వే నా మగాడివి, నువ్వే నా ఆత్మవి, నా బెస్ట్ ఫ్రెండ్‌వి, నా జీవితానికి నువ్వే ప్రేమవంటూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌పై ప్రేమను ఒలకబోసింది. వృత్తి రిత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన ఇషా.. అమిటీ యూనివర్శిటీ నుంచి బీఏ హానర్స్ డిగ్రీ పొందింది. కాగా, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రౌటేలా మాట్లాడుతూ.. పంత్ గురించి తనకు తెలీదని, క్రికట్‌ను తానంతగా ఇష్టపడనని, సచిన్..కోహ్లి అంటే తనకు గౌరవమని పేర్కొనడం విశేషం. చదవండి: మరోసారి కేఎల్ రాహుల్ విధ్వంసం ఖాయం: పంజాబ్ కోచ్ -
ఎప్పుడైతే నీతో ఉన్నానో..: రిషభ్
న్యూఢిల్లీ: ఇటీవల టీవీ నటి ఇషా నేగీతో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ దానికి అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘ నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా. ఎందుకంటే నా సంతోషానికి నువ్వే కారణం’ అని క్యాప్షన్ జోడించాడు. మరి అలా ఎందుకు రాశాడో ఆ సమయంలోనే అందరికీ అర్థమైనప్పటికీ, తాజాగా దాన్ని నిజం చేస్తూ ఇషాను సంతోషంగా ఉంచే పనిలో ఉన్నాడు రిషభ్. ఇప్పుడు ఈ జంట విహార యాత్రల్లో మునిగి తేలుతోంది. క్రిస్ట్మస్, న్యూఇయర్ వేడుకల్లో భాగంగా రిషభ్-ఇషాల జోడి ప్రేమాయణం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని గర్ల్‌ఫ్రెండ్ ఇషాతో గడపడానికి కేటాయించాడు పంత్.(ఇక్కడ చదవండి: సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం) వీరిద్దరూ ఒక మంచు కొండపై షికారు చేస్తూ ఉన్న ఫొటోను ఇద్దరు సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. అయితే దీనికి రిషభ్ కాస్త భిన్నంగా క్యాప్షన్ ఇచ్చాడు. ‘ ఎప్పుడైతే నేను నీతో ఉన్నానో.. అప్పుడు నన్ను నేను బాగా ఇష్టపడుతున్నా’ అని రిషభ్ పేర్కొన్నాడు. ఇక ఇషా మాత్రం ఫిఫ్త్ ఇయర్ అండ్ కౌంటింట్.. లవ్ యూ స్కై బిగ్ బబ్బీ’ అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే వీరి స్నేహం-ప్రేమ మొదలై సుమారు ఐదేళ్లు అయినట్లే అర్థం అవుతోంది. కొంత కాలంగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో పాటు క్యాప్షన్లను కూడా వైవిధ్యంగా పోస్ట్ చేయడంతో ప్రేమలో సీరియస్‌గా మునిగి తేలుతున్నట్లు కనబడుతోంది.మరి ఇది డేటింగ్ వరకే పరిమితం అవుతుందా.. పెళ్లి పీటల వరకూ వెళుతుందో చూడాలి.(ఇక్కడ చదవండి: ఊర్వశి రౌతేలాతో రిషభ్ డేటింగ్!) View this post on Instagram I like me better when I’m with you 🧡🤷🏻♂ A post shared by Rishabh Pant (@rishabpant) on Jan 2, 2020 at 10:52am PST