బొకో హరామ్ నరమేధం
86 మంది మృతి
దలోరి(నైజీరియా): నైజీరియాలో శనివారం రాత్రి మైదుగురి సిటీ దగ్గర్లోని దలోరి గ్రామం, రెండు శరణార్థి శిబిరాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ సృష్టించిన నరమేధంలో చిన్నారులు సహా 86 మంది మరణించారు. ముష్కరులు బాంబుదాడి, కాల్పులకు తెగబడ్డారు. మూడు ఆత్మాహుతి బాంబు దాడుల మంటల్లో చిన్నారులు ఆర్తనాదాలు చేస్తూ మాడిమసైపోయారని చెట్టు చాటున దాక్కుని తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపాడు. పదుల సంఖ్యలో కాలిన శవాలు, రక్తపు మడుగులతో వీధులు నిండిపోయాయి.