కేరళలోని ద్వీపానికి అరుదైన గౌరవం
తిరువనంతపురం: ప్రకృతి అందాలకు మారుపేరుగా ఉన్న కేరళకు అరుదైన గౌరవం దక్కింది. కాక్కత్తూరుత్తులోని ‘కాకుల దీవి(ఐలాండ్ ఆఫ్ క్రోస్)’గా పేరొందిన ద్వీపం ఉత్తమ పర్యాటక స్థలిగా ఎంపికైంది. నేషనల్ జియోగ్రఫిక్ పత్రిక ఎంపిక చేసిన అందమైన పర్యాటక స్థలాల జాబితాలో దీనికి చోటు దక్కింది. నేషనల్ జియోగ్రఫీ వారు ఫొటోగ్రాఫిక్ టూర్ పేరిట ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను కెమెరాల్లో బంధించారు.
ఐలాండ్ ఆఫ్ క్రోస్ కు ఈ గౌరవం దక్కడం పట్ల కేరళ పర్యాటక మంత్రి ఏసీ మొయిదీన్ సంతోషం వ్యక్తం చేశారు. సహజ అందాలకు నిలయమైన తమ రాష్ట్రానికి అరుదైన గౌరవడం దక్కడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.